బీజేపీ – టీడీపీ మధ్య విడాకులయ్యాక ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఆ రెండు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ చేయనంత సాయం ఏపీకి చేశామని బీజేపీ చెప్తోంది. ఇవ్వాల్సినవే ఇవ్వకుండా కేవలం మాటలతో మభ్యపెట్టి మోసం చేశారని టీడీపీ చెప్తోంది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్.. కొన్ని ప్రశ్నలను సూటింగా స్పందించారు.

Image result for lokeshImage result for lokesh vs gvl

          ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు స్పందించే బాధ్యతను రాష్ట్రానికి చెందిన ఎంపీ, అధికార ప్రతినిధి జి.వి.ఎల్.నరసింహారావుకు బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది. దీంతో రోజూ ఏదో అంశంపై జి.వి.ఎల్. మీడియా ముందుకొస్తున్నారు. రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు నిధులిచ్చామంటూ ఊదరగొడ్తున్నారు. ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా జి.వి.ఎల్. చెప్పేది ఒక్కటే.! “ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు.. యూసీలు ఇవ్వలేదు.. నిధులను దుర్వినియోగం చేశారు.. పక్కదారి పట్టించారు.. రాజధానికి వేల కోట్లు ఇచ్చాం..!!” ఇలా చెప్పేసుకుంటూ వెళ్తున్నారు.


          చాలా సందర్భాల్లో టీడీపీ నేతలు బీజేపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. అన్నింటికీ యూసీలు ఇచ్చామని చెప్పారు. ఫలానా వాటికి యూసీలు ఇవ్వలేదని అధికారులు చెప్తే వాటికి క్లారిటీ ఇస్తామని వెల్లడించారు. అంతేకాక తమకు యూసీలు అందినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇచ్చిన అక్నాలెడ్జ్ మెంట్ కాపీలను కూడా బయటపెట్టారు. వీటిపై బీజేపీ స్పందించకపోగా ప్రతిసారీ అవే విమర్శలను గుప్పిస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. అందుకే ట్విట్టర్ వేదికగా జి.వి.ఎల్.నరసింహారావుకు ప్రశ్నల వర్షం కురిపించారు.


          యూసీలు అందాయో లేదో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఉంటుందని.. అంతేకానీ యూసీలపై మాట్లాడడానికి జి.వి.ఎల్. ఎవరని లోకేష్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ సమర్పించినవి తప్పని ఆయన ఎలా చెప్తారని నిలదీశారు. అవి సక్రమంగా లేకుంటే అధికారులు అడగొచ్చన్నారు. వెనుకబడిన జిల్లాలకోసం కేటాయించిన రూ.1000 కోట్లకు సంబంధించిన నిధులపై యూసీలు సమర్పించామని, అవి ఆమోదం కూడా పొందాయన్నారు. అమరావతికి సంబంధించిన డ్రైనేజీల పనులకోసం ఇంతవరకూ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజీలకోసం 460, 540 కోట్ల చొప్పున విడుదలయ్యాయయన్నారు. వీటిలో పనులు పూర్తయిన వాటికి సంబంధించి రూ.349 కోట్లకు సంబంధించిన యూసీలు కేంద్రానికి పంపించామన్నారు. పెండింగ్ పనులన్నీ వచ్చే ఏడాదికి రెండు నగరాల్లో పూర్తవుతాయని, అప్పుడు ఆ లెక్కలు పంపుతామన్నారు లోకేష్.


          ఇప్పటి వరకూ కేంద్రం నుంచి అమరావతికి రూ.1500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయన్నారు. అయితే రూ.1583 కోట్ల విలువైన యూసీలు కేంద్రానికి పంపించామని, అవి ఆమోదం కూడా పొందాయని లోకేష్ ట్వీట్ చేసారు. జి.వి.ఎల్.చెప్తున్నట్టు రూ.8962 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఎప్పుడు ఇచ్చారో, వాటిని ఎప్పుడు ఆమోదించారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేసారు. లేదంటే ఆయన అబద్దాలు చెప్తున్నట్టు అంగీకరించాలని డిమాండ్ చేశారు.


          ఎడ్యుకేషన్ సెస్ ద్వారా వసూలైన రూ.83900 కోట్లు దుర్వినియోగమయ్యాయంటూ కాగ్ తప్పుబట్టిందని, దీనికి కేంద్రం ఏం సమాధానం చెప్తుందని లోకేష్ ప్రశ్నించారు. జూట్ కార్పొరేషన్ పేరుతో నిధులను తప్పుదోవ పట్టించడం, మిగిలిన విభాగాల్లో లెక్కలు ఇంతవరకూ చెప్పకపోవడం లాంటి అంశాలపై ఏం చెప్తారని ఆయన నిలదీశారు. కాగ్ లేవనెత్తిన అంశాలపై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమా.. అని లోకేష్ ట్వీట్ చేశారు. మరి లోకేష్ ట్వీట్లపై బీజేపీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి మరి.!



మరింత సమాచారం తెలుసుకోండి: