ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలలో పెను కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికలలో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అవినీతి వల్ల టిడిపికి అండగా ఉన్న బిజెపి జనసేన పార్టీలు ప్రస్తుతం దూరమయ్యాయి.
Related image
ఈ క్రమంలో ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్న సమయంలో చంద్రబాబు... ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన్న పార్టీతో కలవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికనుగుణంగా నే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జ‌రుగుతోంది. ఏపీ కాంగ్రెస్ మ‌హిళా వ్య‌వ‌హారాల ఇంచార్జీగా తెలంగాణ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే సీత‌క్క‌ను నియ‌మించ‌డం ఇందుకు తార్కాణం.
Image result for chandrababu rahul gandhi
ఇటీవ‌ల క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్‌తో దోస్తీకి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆరాట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌ వ్య‌తిరేక సిద్ధాంతంతో ఏర్పడిన టీడీపీని ఆ పార్టీతో పొత్తుకు సిద్ధ‌ప‌డేలా చంద్ర‌బాబు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీతో బాబు రాసుకుపూసుకొని తిర‌గ‌డంపై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేశారు.
Image result for chandrababu rahul gandhi
అదే స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు సైతం కాంగ్రెస్‌తో పొత్తు విష‌యం ఖండించ‌లేదు. తాజాగా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో చంద్రబాబు కు ఎంతో మేలు చేకూర్చే విధంగా తీసుకున్నారు అని అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు గెలుపుకి రాహుల్ గాంధీ బాగానే కష్టపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: