ఈసారి ఎన్నికల్లో జయభేరి మోగించి మొదటి సారి పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి విశ్వప్రయత్నాలే చేస్తున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ప్రజలకు చేరువకావడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న  పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో మంగళవారం ప్రసంగించిన ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు.


ఆయన మాట్లాడుతూ- చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అగ్రిగోల్డ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎస్సెల్ గ్రూప్ కంపెనీతో రహస్యంగా మాట్లాడారని చెప్పుకొచ్చిన ఆయన, అగ్రిగోల్డ్ కంపెనీ 4500 కోట్లకు కుచ్చుటోపీ పెడితే  2వేల కోట్ల వరకే నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని తెలిపినట్లు చెప్పుకొచ్చాడు. పెద్ద మొత్తంలో మిగిలిన  ఆస్తులు కాజేసే కుట్ర చేస్తున్నట్లుగా తెలిపాడు. 1100కోట్లను నష్టపోయిన  బాధితులకు కేటాయిస్తే 80శాతం బాధితులకు సాయం అందుతుందని తెలిపాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ద్వారా నష్టపోయిన  బాధితులందరికీ న్యాయం చేస్తామని ఈ మేరకు జగన్ ప్రజలకు హామీ ఇచ్చాడు.


తన వేలికి ఉంగరం లేదు, చేతికి గడియారం లేదు, మెడలో గొలుసు కూడా లేదని చెప్పుకున్న బాబు..2ఎకరాల నుంచి 4లక్షల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు? అని ప్రశ్నించాడు. ఆయనకు  ఏ అమ్మాయిని చూసే అలవాటు లేదని, కానీ రాష్ట్రంలో అమ్మాయిలపై జరిగే అత్యాచారాలు, హత్యలను పట్టించుకోరని చెప్పుకొచ్చాడు. బాబుకు ధైర్యం ఎక్కువని, కానీ తనపై వచ్చిన ఆరోపణలుకు మాత్రం విచారణ ఎదుర్కోరని ఈ సందర్భంగా ఎద్దేవా చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: