ఫిరాయింపు ఎంపిల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఎప్పుడైతే వైసిపి ఎంపిల రాజీనామాల‌ను లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఆమోదిస్తున్న‌ట్లు చెప్పారో అప్ప‌టి నుండి ఫిరాయింపుల్లో టెన్ష‌న్ ప్రారంభ‌మైంది. ఎందుకంటే, వైసిపి ఎంపిల రాజీనామాలను స్పీక‌ర్ ఆమోదించ‌ర‌న్న ధైర్యంతో ఫిరాయింపులున్నారు.
Image result for sumitra mahajan
దానికి తోడు ముగ్గురు  ఫిరాయింపు  ఎంపిల స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరిన‌ట్లు వైసిపి ఎంపిలు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మీడియాతో చెప్ప‌టంతో వారికి ఇబ్బందైంది. వైసిపి త‌ర‌పున గెలిచిన నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి, అర‌కు ఎంపి కొత్త‌ప‌ల్లి గీత‌, క‌ర్నూలు ఎంపి బుట్టా రేణుక విడ‌త‌ల వారీగా టిడిపిలోకి ఫిరాయించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. 


భ‌విష్య‌త్తును చెడ‌గొట్ట‌కున్న ఫిరాయింపులు

పార్టీ ఫిరాయించ‌ట‌మైతే త‌మ చేతుల్లో ఉంది కాబ‌ట్టి సుల‌భంగా గోడ దూకేశారు. టిడిపిలోకి ఫిరాయించిన త‌ర్వాతే అస‌లు సినిమా మొద‌లైంది. ఎలాగంటే పార్టీ ఫిరాయించిన‌పుడు వాళ్ళందరికీ చంద్ర‌బాబునాయుడు రెడ్ కార్పెట్ ప‌రిచారు. త‌ర్వాత ఎవ‌రినీ ప‌ట్టించుకోలేదు. టిడిపి నేత‌లు కూడా ఫిరాయింపుల‌ను ద‌గ్గ‌ర‌కు రానీయ‌టం లేదు.  దాంతో వాళ్ళ ముగ్గురి ప‌రిస్ధితి ఎటూ కాకుండా పోయింది.

Related image

టిడిపిలో ఇమ‌డ‌లేక తిరిగి వైసిపిలోకి రాలేక నానా అవ‌స్త‌లు ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాళ్ళ‌కు టిక్కెట్లు వ‌స్తుందో రాదో చెప్ప‌లేకున్నారు. ఎందుకంటే, నియోజ‌క‌ర్గంలో కూడా జ‌నాలు వాళ్ల‌ని చీద‌రించుకుంటున్నారు. ఇటువంటి ప‌రిస్దితుల్లో అన‌ర్హ‌త వేటు ప‌డి త‌మ నియోజ‌క‌వర్గాల్లో కూడా ఉప ఎన్నిక‌లు జ‌రిగితే ప‌రిస్దితి ఏంట‌నేది వాళ్ళ‌కు అర్ధంకాక ఫిరాయింపుల్లో టెన్ష‌న్ మొద‌లైంది.

  


మరింత సమాచారం తెలుసుకోండి: