చంద్ర‌బాబునాయుడుపై రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ దాడి మొద‌లుపెట్టింది. అందులో భాగంగానే గురువారం గ‌వ‌ర్న‌ర్ ఇఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసి ఫిర్యాదు చేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో అవినీతి పెరిగిపోయింద‌ని బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నేతృత్వంలోని బృందం చంద్ర‌బాబు పై చేసిన‌ ఫిర్యాదులో పేర్కొంది. ప‌నిలో ప‌నిగా ఫిరాయింపు మంత్రి అఖిల‌ప్రియ‌ను వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఫిరాయింపు మంత్రితో పాటు ఫిరాయింపు  ఎంఎల్ఏల‌పైన కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఎక్క‌డెక్క‌డ అవినీతి జ‌రుగుతోంది అన్న వివ‌రాల‌ను బిజెపి నేత‌లు త‌మ ఫిర్యాదులో ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా వివ‌రించిన‌ట్లు స‌మాచారం. 

Image result for chandrababu naidu

బిజెపి వైఖ‌రి చూస్తుంటే చంద్ర‌బాబుపై ఏక కాలంలో  రెండు వైపుల నుండి దాడి మొద‌లుపెట్టిన‌ట్లే క‌న‌బ‌డుతోంది. కేంద్ర‌స్ధాయిలో ఎయిర్ ఏషియా కుంభ‌కోణం విచార‌ణ‌ను వేగ‌వంతం చేయ‌టం, రాష్ట్ర స్ధాయిలో ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న‌ అవినీతిపై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేయ‌టం ద్వారా చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచాల‌ని బిజెపి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.  అయితే, ఇక్క‌డ విచిత్ర‌మేమిటంటే ప్ర‌భుత్వ ఖ‌ర్చుతోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడిని విమ‌ర్శించ‌టం ఏంట‌ని క‌న్నా ప్ర‌శ్నిస్తున్నారు. మోడిని విమ‌ర్శించటంలో ప్ర‌భుత్వ ఖ‌ర్చ‌ని పార్టీ ఖ‌ర్చ‌ని వేర్వేరుగా ఉండ‌వు. క‌న్నా చెప్పిందే నిజ‌మైతే ప‌శ్చిమ‌బెంగాల్లో మ‌మ‌త ముఖ‌ర్జీ, ఒడిస్సాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ , ఢిల్లీలో కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మోడి పై ఆరోప‌ణ‌లు చేయ‌ని రోజు, విమ‌ర్శించ‌ని రోజంటూ ఉండ‌దు. కేంద్రం నిధులు అందుకుంటూ ప్ర‌ధానిని విమ‌ర్శించ‌కూడ‌దంటూ 2014కు ముందు వ‌ర‌కూ బిజెపి ముఖ్య‌మంత్రులు ఏం చేశారో క‌న్నా ఒక‌సారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది.


బిజెపి వ‌ర్గాల ప్ర‌కారం ఎయిర్ ఏషియా కుంభ‌కోణం విచార‌ణ‌ను వేగ‌వంతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఒక‌సారి విచార‌ణ వేగ‌వంత‌మైతే చంద్ర‌బాబు, అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప్ర‌మేయంపై క్లారిటీ వ‌స్తుంది. నిజంగానే ఈ ఇద్ద‌రికి కుంభకోణంలో భాగ‌స్వామ్య‌ముంటే ఎఫ్ఐఆర్ పెట్టి సిబిఐ విచార‌ణ మొద‌లుపెట్టే అవ‌కాశాలున్నాయి. అంటే త‌మ చేతికా మట్టి అంట‌కుండా, చంద్ర‌బాబుపై కేసులు న‌మోదైనా సిబిఐ విచార‌ణ మొద‌లుపెట్టినా జ‌నాల్లో సానుబూతి రాకుండా ఉండేలా బిజెపి ప్లాన్ చేస్తోందేమో అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: