వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా విషయం లో రాజీనామా లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా కోసం తమ పదవులను సైతం లెక్క చేయకుండా రాజీనామా లు చేసిన ఎంపీలు కు ప్రజల్లో సానుభూతి వస్తుందని చెప్పడం లో ఎటువంటి ఆతిశయెక్తి లేదు.అయితే టిడిపి వారు ఈ విషయం లో కూడా లేని పోనీ విమర్శలు చేసి పరువు పోగుట్టుకుంటున్నారని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. 

Image result for tdp party
వైకాపా ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేశారు. ఎలాంటి పితలాటకాలు లేకుండా, జాగు జరగకుండా ఉండేందుకు తామందరూ ప్రత్యేకహోదా కోసమే రాజీనామాలు చేస్తున్నప్పటికీ.. ఆ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా అచ్చంగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేశారు. అయినా స్పీకరు వాటిని వెంటనే ఆమోదించలేదు. మధ్యలో ఓసారి స్పీకరు పిలిపిస్తే వెళ్లి భేటీ అయిన ఎంపీలు రాజీనామాల విషయంలో పునరాలోచన లేదని తెగేసి చెప్పారు.
Image result for tdp party
స్పీకరు స్పందించలేదు. మళ్లీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి బుధవారం పిలిపించారు. అయిదుగురు ఎంపీలు మళ్లీ అదే విషయం చెప్పారు. కన్ఫర్మేషన్ లెటర్లు ఇవ్వాలని స్పీకరు అడగడమే చిత్రం.. కానీ, అదేరోజున ఎంపీలు ఆ లెటర్లు కూడా ఇచ్చేశారు. విషయానికి వస్తే.. స్పీకరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకోవాలో నిర్దేశించే అధికారం ఎవ్వరికీ లేదు. ఇక్కడ లోక్ సభ స్పీకరు చర్యను తప్పుపడుతున్న, ఆ స్థానానికి రాజకీయ రంగు పులుముతున్న తెలుగుదేశం దళాలు.. తమ పార్టీ వాడైన ఏపీ శాసనసభ స్పీకరు కోడెల శివప్రసాద్ అచేతనమైన పనితీరు గురించి ఎందుకు నోరుమెదపడం లేదు. ఈ విధంగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం టీడీపీ కి మేలు కన్నా చేటే చేస్తుందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: