చంద్రబాబు ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో కూడా ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకునే పోటీకి దిగేవారు. గత ఎన్నికలలో బీజేపీ-జనసేన పార్టీలతో బరిలోకి దిగిన చంద్రబాబు కేవలం కొద్దిపాటి ఓటింగ్ శాతంతో అధికారంలోకి రావడం జరిగింది. అయితే తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇష్టమొచ్చినట్లుగా పరిపాలిస్తూ అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్రరాష్ట్రాన్ని అవినీతి పాలు చేశారు.

Related image

ఈ క్రమంలో అవినీతి సొమ్ముతో పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకి నోటు కేసులో అడ్డంగా బుక్ అయిపోయి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీ పడి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిలువునా ముంచేశారు చంద్రబాబు. ఈ క్రమంలో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి చంద్రబాబుకు మధ్య అంతరాయం ఏర్పడడంతో బిజెపి టిడిపి కూటమి దెబ్బతింది...అలాగే మరోపక్క చంద్రబాబు చేసిన అవినీతిని చూసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image result for chandrababu sonia gandhi

దీంతో ఇప్పుడు ఎన్నికలు  ఇంకా ఏడాది ఉంటున్న నేపథ్యంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జత కలవడానికి సిద్ధమైపోయారు. ఈ విషయం ఇప్పటికే బయటపడిపోయింది. ఇటీవల బెంగళూరులో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరైన చంద్రబాబు నాయుడు అక్కడ కాంగ్రెస్ నేతలతో ఖుషీగా కనిపించాడు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో ముచ్చట్లు పెట్టాడు.

Related image

అంతేకాకుండా ఈ బంధాన్ని నిజం చేస్తూ ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికైన ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పై….చంద్రబాబు నాయుడు సూచన మేరకే తను కాంగ్రెస్ తో చేతులు కలిపాను అని అన్నాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేది చంద్రబాబు చేసిన సూచనే అని, కేసీఆర్ కూడా ఇదే చెప్పాడని అందుకే తను ఆ పార్టీతో చేతులు కలిపాను అని కుమారస్వామి చెప్పుకున్నాడు. మొత్తంమీద దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి చంద్రబాబునాయుడు కూడా తీవ్రంగానే కష్టపడుతున్నాడు అని అంటున్నారు రాజకీయవిశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: