తాను రాజకీయాలలోకి రావాలనుకుంటున్నానని మహారాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాను చేస్తున్న పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు అప్పటిలో ఎవరికి తోచినట్లుగా వారు వార్తలు రాసారు. అయితే ఆయనపై వచ్చిన రూమర్లకు అయన ఎప్పుడూ స్పందించలేదు.


కేవలం రైతుల కోసమే తాను రాజకీయాలలోకి వచ్చానని చెప్పుకున్న అయన రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటూ రైతు కార్యక్రమాలపై అవగాహన పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం టి బూర్జవలసలో పర్యటించిన ఆయన ఆ గ్రామసభలో మాట్లాడుతూ ఆయనపై వస్తున్న వదంతులపై మొదటిసారి నోరువిప్పారు. తాను బీజేపీలో   చేరబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి  లేదని చెప్పారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నానని, వాటిని పరిష్కరించేందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నానని చెప్పారు. బీజేపీనే కాదు అసలు ఏ పార్టీతోను టచ్‌లో లేనని, కేవలం ప్రజలతోనే టచ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు.


నటుడు శివాజీ  ఆపరేషన్ మీరు దక్షిణాదిపై ఆపరేషన్ గరుడ ప్లాన్‌తో వచ్చారని చెబుతున్నారు, దీనికి మీరేం చెబుతారని విలేఖరులు అడగ్గా.. అసలు తనకు ఆపరేషన్‌ గరుడ అంటే ఏమిటో కూడా తెలియదని చెప్పారు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు గరుడ పక్షిలాంటి దృక్పథం అలవరచుకోవాలని మాత్రమే తనకు తెలుసునని చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేయుచున్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన సభాముఖంగా తెలియజేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: