తిరుమల తిరుపతి మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ లోటస్ పాండ్ లో కలిసారు. ఈ సందర్భంగా జగన్ ఇంటి నుండి బయటకు వచ్చి రమణదీక్షితులని సాదరంగా ఇంటిలోపలికి ఆహ్వానించారు. ఇటీవల తిరుమల తిరుపతి లో అవినీతి అక్రమాలు దైవానికి విరుద్ధంగా కొన్ని పనులు జరుగుతున్నాయని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రమణదీక్షితులు. తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
Related image
ఈ సందర్భంగా రమణదీక్షితులు ప్రభుత్వం నుండి తనకు ఎదురైన అన్యాయాన్ని ఆరోపణలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా వారసత్వంగా వచ్చిన అర్చకత్వ విధుల నుంచి తమను కావాలనే టీడీపీ ప్రభుత్వం తొలగించారంటూ రమణ దీక్షితులు చెప్పిన విషయాలపై జగన్‌ సానుకూలంగా స్పందించారు. రమణ దీక్షితులకు న్యాయం చేస్తామని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా నిక్షేపాల కోసం తిరుమల శ్రీవారి పోటులో కొందరు తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తవ్వకాలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఆ వంట గదిలో జరిగిన మార్పులే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు.
Image may contain: 4 people, people smiling, outdoor
ఇదే విషయాన్ని రమణదీక్షితులు ఇంతకు ముందు జాతీయ చానల్ ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ముఖ్యంగా కొంతమంది ఆలయ అధికారుల వల్ల స్వామివారి అనుగ్రహం పోతుందని...ఆయన మహిమా ప్రజలకు అందటం లేదని  అన్నారు. ఈ విషయంలో జగన్ కలుగజేసుకుని ఆలయ ప్రతిష్టను కాపాడాలని పేర్కొన్నారు.
Related image
ముఖ్యంగా గత కొంత కాలం నుండి చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణులపై చేపడుతున్న కక్షసాధింపు చర్యలకు జగన్ అడ్డుకట్ట వేయాలని మరీ వేడుకొన్నారు రమణదీక్షితులు...ఈ క్రమంలో జగన్ రమణదీక్షితులు చెప్పిన వాటన్నిటికీ సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా జగన్ కంటే ముందు చంద్రబాబుని కలవాలని రమణదీక్షితులు ప్రయత్నించారు..కానీ చంద్రబాబు రమణదీక్షితులను కలవటానికి ఇష్టపడకపోవడంతో...వెంటనే రమణదీక్షితులు తన బాధను జగన్ దగ్గర వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: