ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్ వచ్చే ఎన్నికల వ్యూహంలో భాగంగా పాదయాత్ర చేస్తూ బిజీ గా ఉన్నాడు. ఇక నారా లోకేష్ విషయానికొస్తే ఐటీ మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖల భాద్యతలను నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ ప్రతిపక్ష, అధికార పార్టీలకు చెందినవారన్న అందరికి విదితమే. సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తికి మద్దతు తెలపడం సహజమే. కానీ టాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటి శ్రీరెడ్డి మాత్రం ఇద్దరికీ మద్దతు తెలుపుతూ తాను ఎవరికి స్పష్టమైన మద్దతును తెలుపుతుందన్న విషయం సస్పెన్స్ లో పెట్టింది.


సామాజిక మాధ్యమాలలో తరచూ పోస్టులు చేసే ఆమె ఒకసారి జగన్ పై సానుభూతి వాఖ్యలు చేస్తే ఇంకోదాంట్లో లోకేష్ కు సానుకూలంగా వ్యవహరిస్తుంది. జగన్ అన్నా..రౌడీ రాజకీయాలు చేసేవాళ్ళని కలుపుకోవద్దు. ఓర్పు, శాంతి జగన్ ఆయుధాలు అంటూ జగన్ కు సలహాలు ఇచ్చిన ఆమె తాజాగా జగన్ కు తేనెటీగలు కుట్టిన నేపథ్యంలో జగన్ గారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా, దేవుడి కృప  ఆయనపై ఉండాలి అంటూ జగన్ పై  సానుభూతి తెలిపినది. 


మంత్రి లోకేష్ కు కూడా మద్దతుగా నిలుస్తోంది. నారాలోకేష్ పై ఎవరైనా కామెంట్లు చేస్తే ఊరుకోనని తెగ వార్నింగ్ ఇస్తుంది. అంతేగాక లోకేష్ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మొదలుపెడితే తాను వెనకనడుస్తా అంటూ చెప్పి తాను వైసీపీ మద్దతుదారా లేక టీడీపీ సానుభూతిరాలా అన్న విషయం స్పష్టంగా తెలుపడంలేదు. కొందరైతే ఆమె ఎవరి మద్దతురాలు కాదని తీసిపారేస్తున్నారు. ఎందుకంటే వీరిపై చేసిన ప్రతి పోస్టులో ఆమె పవన్ ని చేర్చి విమర్శించడమే కారణం. వీరిని అడ్డంపెట్టుకొని పవన్ ను విమర్శిస్తున్నదనేది వారి వాదన. మరి ఈమె మనసులో ఏ పార్టీ లో చేరాలని ఉందో ఏమో! 


మరింత సమాచారం తెలుసుకోండి: