ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగాడు. నేడు  శుక్రవారం రోజున విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, ఆయన హయాంలో జరగుతున్న అవినీతిని, ఆయన చేస్తున్న అక్రమాల గురించి ధ్వజమెత్తాడు.


ఆయన మాట్లాడుతూ..ఇక్కడి ఎన్నో కుటుంబాలకు ఏటికొప్పాక బొమ్మల తయారే జీవనాధారమని, అలాంటి కళకు అవసరమైన సరుకును ప్రజలు అడవి నుంచి పొందనీయకుండా ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులతో కేసులు పెట్టిస్తున్నదని, ఇసుక మాఫియాపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి కేసులు నమోదుచేయదని మండిపడ్డారు. చట్టాలు బలవంతులపై బలహీనంగా పనిచేస్తాయని, ఇలాంటి అన్యాయాలను ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ మరోమారు స్పష్టం చేశారు. 


అప్పట్లో హోదా కంటే ప్యాకేజీనే ముద్దు అని చెప్పిన బాబు ఇప్పుడు మాత్రం హోదా అని ఎందుకు అడుగుతున్నాడని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ పవన్, చంద్రబాబుని వెన్నుపోటుదారుడని అనలేదు కానీ మొదటిసారి మాత్రం వెన్నుపోటుదారుడని వాఖ్యలు చేశాడు. తాను చంద్రబాబులా వెన్నుపోటుపొడిచే వ్యక్తిని కాదని, ఏమీ ఆశించకుండానే టీడీపీకి మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు కారణమయ్యానని చెప్పాడు. ఇందును బట్టి ఆయన జనసేన కార్యకర్తలను క్షమాపణలను కోరాడు. తాను అన్ని వదిలేసే రాజకీయాల్లోకి వచ్చినట్లు, ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడతానని మళ్ళీ చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: