గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తిరిగి అధికారాన్ని సాధించాలనే కోరికతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రజలు తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే అవి చేస్తా ఇవి చేస్తా అంటూ తనకు నోటికొచ్చిన వాగ్దానాలు చేసాడు. ప్రజలు బాబును నమ్మి ఓట్లు వేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే పలానా కులానికి ఇది  చేస్తా అని పలానా కులానికి అది చేస్తా అంటూ తెగ హామీలు ఇచ్చిన బాబు వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో ఆయా కులాల వారు బాబుకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


ఓట్ల కోసం కుల రిజర్వేషన్ల ను అస్త్రంగా వాడుకున్నాడు బాబు. కాపులను బీసీల్లోకి చేరుస్తామని ప్రకటించి తీరా అధికారంలోకి వచ్చాక అసలు దాని ఊసే ఎత్తలేదు. ముద్రగడ లాంటి వ్యక్తులు కాపు గర్జన మరియు నిరాహార దీక్షలాంటి నిరసనలు తెలిపినా కేవలం కాపు కార్పొరేషన్‌ ఒకటి ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నాడు. ఈ చర్యతో కాపు వర్గం అంతా బాబుకు వ్యతిరేకమైందని సమాచారం. ఇదిలా ఉంచితే కాపు రిజర్వేషన్ అంటూ బీసీల్లో గుబులు పుట్టించాడు బాబు. బాబు కాపు రిజర్వేషన్ అని చెప్పిననాటి నుండే బీసీ వర్గంలోని కొన్ని కులాల నాయకులు బాబుకు వ్యతిరేకంగా తయారయ్యారంట. అవసరమైన సమయంలో తమ ప్రభావం చూపించడానికి రెడీగా ఉన్నారని సమాచారం.


ఈ రెండే గాక ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీ కరణకు మద్దతునిస్తారనే ఉద్దేశ్యంతో మంద కృష్ణ మాదిగ గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు పలికాడు. అయితే ఇప్పుడు ఆ ఊసేలేదు, అంతేగాక ఎన్డీయే నుండి టీడీపీ బయటకి రావడంతో ఇప్పట్లో వర్గీకరణ సాధ్యం కాదు. కాబట్టి మాదిగ కులానికి చెందిన వారు బాబుపై గుర్రుగా ఉన్నారట. ఈ మూడు సామాజిక వర్గాలే కాకుండా బ్రాహ్మణ వర్గం కూడా తాజా పరిణామాల వల్ల టీడీపీ కి దూరమయ్యే పరిస్థితి కనపడుతోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేఖ పోస్టులు చేసాడని మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు ని బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ పదవి నుండి అవమాన కర రీతిలో తొలగించడం, మొన్న టీటీడీ అర్చకుల పదవీ విరమణ కాలాన్ని బోర్డు 65 ఏళ్లకే కుదించటం పట్ల బ్రహ్మణులు బాబుకు వ్యతిరేకంగా మారుతున్నారు. మరి ఈ నాలుగు సామాజిక వర్గాలలో టీడీపీ పై  వ్యతిరేకత ఎక్కువవుతున్న క్రమంలో వీరు పూర్తి వ్యతిరేకం అయితే మాత్రం టీడీపీ కి నూకలు చెల్లినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: