రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏ  పార్టీలకు ఆ పార్టీ వారు కొత్త వ్యూహాలను రచిస్తూ కొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తన  అధికారాన్ని నిలుపుకోవడానికి తన అనుభవాన్ని ఉపయోగిస్తుంటే, ఇటు ప్రతిపక్ష నేత జగన్ మాత్రం పాదయాత్ర చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కాగా బాబు తెలివిగా వేసిన స్కెచ్ ఇప్పుడు ఒకటి బయటకి పొక్కింది. జగన్ ఇలాకా అయిన పులివెందులలో టీడీపీని బలోపేతం చేయడానికి, చంద్రబాబు అక్కడి ప్రజల సమస్యని ఎన్నుకొని, దాన్ని పరిష్కరించి సఫలుడయ్యాడని సమాచారం.


మామూలుగా కడప జిల్లా అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటిది. అందులోనూ పులివెందులలో వారికి తిరుగేలేదు. గతంలో వైఎస్సార్ సైతం ఇక్కడి నుండే శాసనసభకు పోటీ చేసేవాడు. ప్రస్తుతం జగన్ కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నాడు. మరి ఇలాంటి బలమైన స్థానంలో బలమైన వారు చతికిలపడితే ఏమవుతుంది? నాయకుడే గెలవలేనపుడు పార్టీలోని నేతలంతా చెల్లాచెదురవడం ఖాయం. అందుకే చంద్రబాబు కడప జిల్లా మొత్తం కంటే పులివెందులపై ఈ సారి ఎక్కువ దృష్టి సారించాడని సమాచారం. అందుకే ఇక్కడి ఓట్లర్లను ఆకర్షించడానికి ఇక్కడి ప్రధాన సమస్యయైన నీటి కొరతపై  పరిష్కారం చూపి సఫలుడయ్యాడట.


అదెలాగంటే..కృష్ణాజలాలను జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట ప్రాజెక్టుకి తరలించి, అక్కడనుంచి పులివెందుల పరిధిలోని  చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు జలకళ తీసుకొచ్చారు. ఇక అక్కడ నుండి వాటిని  పులివెందుల కెనాల్స్‌కు విడుదల చేశారు. దీంతో పులివెందుల నియోజకవర్గ ప్రజలకు అటు తాగడానికి, ఇటు సేద్యానికి నీటిని అందించి నీటి కొరతను లేకుండా చేసారు. ఇన్ని ఏళ్లయినా వైఎస్ కుటుంబం చేయలేని పని టీడీపీ ప్రభుత్వం చేయడంతో అక్కడి ప్రజలకు టీడీపీపై సానుభూతి పెరుగుతుందని టీడీపీ శ్రేణుల రిపోర్టుల సమాచారం. మారుతున్న కాలంలో ఓటర్లు కూడా మారారు అనే దానికి నిదర్శనమే గత ఎన్నికలలో అనుభవశాలైన బాబును ప్రజలు గెలిపించడం. మరి బాబు వేసిన ఈ స్కెచ్ లో జగన్ చతికిలపడడం అసాధ్యమయినప్పటికీ పులివెందులలో వైసీపీ కి మెజారిటీ తగ్గినా బాబు విజయం సాధించినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: