విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడులకు అధినేత చంద్రబాబు షాక్ ట్రేట్ మెంట్ ఇవ్వబోతున్నారా. పరిస్థితి చూస్తే ఔననే సమాధానం వస్తోంది. ఈ ఇద్దరి  తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు గుస్సా అవుతున్నారు. ఎన్ని మార్లు చెప్పినా అమాత్యులు తమ వైఖరి ఏ మాత్రం మార్చుకోకపోవడమే కాకుండా పార్టీని సైతం ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తమ ఇగోలను పక్క్న పెట్టి పార్టీ పటిష్టతకు పని చేయాలని బాబు ఎంత మొత్తుకుంటున్నా మంత్రులిద్దరి చెవికీ ఎక్కడం లేదు సరి కదా మరింతగా రెచ్చిపోతున్నారు. సోమవారం రాత్రి  జరిగిన ఇఫ్తార్ విందులోను మంత్రులిద్దరూ హాజరైనా  ఎడ ముఖం పెడ ముఖంగానే గడిపారు. దాంతో పార్టీ కేడర్ కూడా ఇద్దరూ ఇంతేనని విసుక్కుంటోంది.
Image result for GANTA SRINIVASA RAO
దశాబ్దాల నాటి వైరం
ఈ ఇద్దరి మధ్యన శత్రుత్వం ఈ నాటిది కాదు. గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. అయ్యన్న ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి 1999లో అనకాపల్లి ఎంపీగా నెగ్గిన గంటా తరువాత కాలంలో తనదైన రాజకీయం చూపించి అయ్యన్నకే షాక్ ఇచ్చారు. జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గం నేతగా దూకుడు ప్రదర్శిస్తూ ఏకంగా బాబుకే సన్నిహితునిగా మారిపోయారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి తన బలగాన్ని సొంతంగా తయారు చేసుకోవడం, కాంగ్రెస్  లో చేరి మంత్రి అయి చిరకాల వాంఛ తీర్చుకోవడం వరకు గంటా రాజకీయ దూకుడు ఓ రేంజిలో కొనసాగింది. విభజన పరిణామాలలో కాంగ్రెస్ నుంచి తిరిగి తెలుగుదేశంలో చేరడంతో మళ్ళీ ఒకే పార్టీలో ఇద్దరు నేతలు కత్తులు దూసుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి జిల్లాలో రెండు వర్గాలుగా టీడీపీ రాజకీయం విడిపోయింది.
Image result for చింతకాయల అయ్యన్న పాత్రుడు
బాబు మాట బేఖాతర్
సాక్షాత్తు అధినేత చంద్రబాబు కలసి ఉండండి, విభేదాలు మరచిపోండంటూ ఘాటుగా మందలించినా ఇద్దరిలోనూ ఏ మాత్రం మార్పు రాలేదు సరి కాదా మేమింతే అన్నట్లుగా వ్యవహిస్తున్నారు. విశాఖ నగరంలో భూ కుంభ కోణంలో గంటా వున్నారంటూ అయ్యన్న సంచలన ఆరోపణలు చేస్తే, విశాఖ ఏజెన్సీలో అక్రమ గంజాయి రవాణా వెనుక మంత్రి అయ్యన్న హస్తం ఉందంటూ గంటా ప్రత్యారోపణలు చేయడంతో వివాదం మరింతగా ముదిరింది. పార్టీ పరువు బజార్లో పడింది. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు  తీరు మార్చుకోక పోతే ఇద్దరినీ పక్కన పెడతానంటూ హెచ్చరించారు. అయినా మళ్ళీ అదే వైరంతో మంత్రులు జిల్లాలో పార్టీని భ్రష్తు పట్టిస్తున్నారు.

నామినేటెడ్ కు దిక్కు లేదు
ఇద్దరు మంత్రుల వివాదం పుణ్యమాని జిల్లాలో సీనియర్ నాయకులకు నామినాటెద్ పదవులు సైతం దక్కని విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకరు తయారు చేసిన జాబినాను ఇంకొకరు ఆమోదించక పోవడంతో అసలు పొస్టుల భర్తీయే వద్దు అన్న నిర్ణయానికి హై కమాండ్  వచ్చేసింది. దీంతో సుదీర్ఘ కాలం పార్టీనె అంటిపెట్టుకుని పనిచేస్తున్న నాయకులకు పదవులు అందని పండు అయ్యాయి. జిల్లా ఇంచార్జి మంత్రి హోదాలో నిమ్మకాయల చిన రాజప్ప ఇద్దరికీ నచ్చచెప్పినా ఫలితం శూన్యం.

బాబు మార్క్ ట్రీట్ మెంట్
ఇద్దరు మంత్రుల విభేదాలతో జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్న క్రమంలో ఈ ఇద్దరిపైనా బాబు సీరియస్ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో టిక్కెట్ల విషయంలోను ఈ సారి వీరి మాట చెల్లుబాటు అయ్యెలా కనిపించడం లేదు సరి కదా వీరికి సైతం టిక్కెట్లు గ్యారంటీ లేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ ఇద్దరు ప్రాతినిద్యం వహిస్తున్న భీమిలి, నర్శీపట్నం నియోజక వర్గాలలో పార్టీకి  ఎదురు గాలి వీస్తోంది. బాబు ఎమ్మెల్యేలకు ఇచ్చే ర్యాంకులలొ సైతం మంత్రులు బాగా వెనకబడ్డారు. ఇవన్నీ పరిగణన లోకి తీసు


మరింత సమాచారం తెలుసుకోండి: