చంద్ర బాబు నాయుడు తన ఘనతలు చెప్పుకోవడం లో తానే సాటి. ఒక చిన్న పని చేసి దానికి ఓ రేంజ్ లో ప్రచారం చేసుకోవడం లో ఎవరైనా బాబు తరువాతే అని ఒప్పుకోవచ్చు. అయితే నాలుగేళ్లు పరిపాలన పూర్తయిన సందర్బంగా చంద్ర బాబు నాయుడు తన పాలన గొప్పలు గురించి అప్పుడే తన అనుకూల పత్రికల ద్వారా తన గొప్పలు రాయించుకుంటున్నాడు. ఒక సరి ఆ పత్రికలు పరిశీలించినట్లైతే..!

Image result for chandrababu naidu

నాలుగేళ్లు పది పథకాలు అని రాసింది. ఆ పది పథకాల్లో తొమ్మిది వ్యవహారాలు కేవలం కట్టుకథలు. వాటిల్లో నిజం ఏదైనా ఉందంటే.. ఒక్క పెన్షన్లు మాత్రమే. అంతకు ముందు ఐదు వందల రూపాయల స్థాయిలో ఉండిన పెన్షన్‌ను వెయ్యి రూపాయలు చేశారు. కానీ.. ఇదే సమయంలో ఇంటికి ఒక్క పెన్షన్ అనే నియమాన్ని తీసుకొచ్చారు. అంతకు ముందు ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరికీ పెన్షన్ వచ్చేది. అయితే పెన్షన్ వెయ్యి చేసి.. ఇంటికి ఒకటే అన్నారు. ఇదెలా ఉందో అర్థం చేసుకోవడం ఈజీనే. పేరుకు పెన్షన్‌‌ను పెంచి, అర్హుల సంఖ్యను సగానికి సగం తగ్గించేశారు.

Image result for chandrababu naidu

అందుకే ఈ పథకం కూడా జనాల్లోకి ఎంత వరకూ వెళ్లిందో డౌట్. ఇంట్లో ఒకరే వృద్ధులు ఉండి.. వెయ్యి రూపాయలు అందుకుంటుంటే.. అలాంటి వారికి మాత్రమే ఈ పథకం ప్లస్. వాళ్లే చంద్రబాబును రక్షించాలి. ఆ సంగతలా ఉంటే.. ఇక పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎన్నోసారి అని అడగొద్దు. ఇప్పటికే చాలా సార్లు జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరోసారి. అదేమంటే డయాఫ్రం వాల్ పూర్తి అయ్యిందట. అందుకే జాతికి అంకితమట. దీని కోసం ప్రజల సొమ్ముతో చంద్రబాబు నాయుడు మళ్లీ ఆర్బాటం.


మరింత సమాచారం తెలుసుకోండి: