ఈసారి ఎన్నికల్లో జయభేరి మోగించి మొదటి సారి పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి విశ్వప్రయత్నాలే చేస్తున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ప్రజలకు చేరువకావడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమగోదావరిలో తనయాత్రను పూర్తి చేసుకున్న ఆయన నిన్న తూర్పు గోదావరిలో అడుగుపెట్టాడు. నేడు ఆ జిల్లాలోని రాజమహేంద్రవరంలో తన పాదయాత్రను కొనసాగించనున్నాడు.


అయితే కేవలం పాదయాత్రనే గాక బాబు చేసిన తప్పిదాలు కూడా జగన్ ను సీఎం ను చేస్తాయని తెలుస్తోంది. మరి బాబు చేసిన తప్పిదాలు.. నెరవేర్చలేని హామీలను కులాల ప్రాతిపదికగా వాగ్దానాలు చేయడం. ఎన్నికల ముందు అధికారంలోకి కొన్ని కులాలకు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటూ హామీ ఇచ్చి, ఇప్పుడు మాత్రం వారందరికీ కుచ్చు టోపీ పెట్టాడు. అయితే ఇప్పుడు వారందరూ చంద్రబాబుకు వ్యతిరేకం అవడంతో ఇంక ప్రత్యామ్నాయంగా  జగన్ కు తమ మద్దతు తెలుపుతున్నట్లు బాహాటంగానే తెలుస్తోంది. ఈ మూడు కులాలు ప్రధానంగా కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే బాబు ఎన్నికల ముందు కాపులను బీసీల్లోకి చేరుస్తామని హమీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రిజర్వేషన్ అన్న సంగతే మర్చిపోయాడు.

దీనిపై అప్పట్లో రాష్ట్రంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సంగతి విధితమే. కాపు ఉద్యమనేత ముద్రగడ బాబును విమర్శిస్తూ జగన్ కు మద్దతుగా మాట్లాడటం ఈ సారి ఎన్నికల్లో వైసీపీ కి కాపు మద్దతు లభించేట్లు కనబడుతుంది. అంతేగాక ఇటీవల కాలంలో అర్చకుల వయోపరిమితిపై టీటీడీ బోర్డు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం పట్ల బ్రహ్మణ వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. ఈ క్రమంలోనే రమణ దీక్షితులు జగన్ ను కలవడం వెనుక తాము ఆ ఆంక్షలు ఎత్తివేస్తే ఎన్నికల్లో  బ్రాహ్మణుల మద్దతు కల్పిస్తా అనే డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. కులాల మద్దతుపై ఇన్ని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక మోస్తరుగా ఉండే ఈ కులాల ఓట్లు ఎవరికి వెళ్తాయో అన్నది సర్వత్రాఆసక్తి రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: