కేంద్రంలోని బీజేపీ తాపీగా కడప  ఉక్కు ఫ్యాక్టరీకి హ్యాండ్ ఇచ్చేసింది. ఇక ఇపుడు విశాఖ వంతు వచ్చింది. ఎంతో కాలంగా వూరిస్తున్న రైల్వే జోన్ కి కూడా ఇక మంగళం పాడేస్తుందన్న  మాట గట్టిగా వినిపిస్తోంది. నిజానికి రైల్వే జోన్ విషయంలో కమల నాధులు ఎన్నెన్ని మాటలు తిప్పారో చెప్పాలంటే ఓ పెద్ద సినిమావే అవుతుంది. అప్పట్లో కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు వున్నపుడు ఇదిగో జోన్ అదిగో జోన్ అంటూ ప్రతీ రోజూ బీజెపీ నాయకులు వూదర గొట్టారు. అయన ఉప రాష్ట్రపతిగా వెళ్ళాక ఏపీ బీజేపీ అధ్యక్షుడు , విశాఖ ఎంపీ హరిబాబు జోన్ పేరు చెప్పి ఎన్నో హరి కధలు వినిపించారు. జోన్ వచ్చేస్తోందని చెబుతూనే పుణ్య కాలమంతా గడిపేశారు. 

Image result for visakha railway zone

టీడీపీ కటీఫ్ తో మారిన సీన్
ఇంతలో బీజేపీ, టీడీపీ బంధం పుటుక్కున తెగిపోయింది. సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చిందన్న తీరుగా ఈ రాజకీయ యుధ్ధం కాస్తా ఏపీలోని ప్రాజెక్టులపై పడింది.  ఏపీకి ఏం చేసినా వేస్టే అన్న ఫీలింగ్ లో బీజేపీ వుంది. ఆ పార్టీ పెద్ద తలకాయ లూ ఇపుడు లేవు. హరి బాబు ఉత్త ఎంపీగానే మిగిలిపోయారు. ఆయనకూ ఇపుడు ఏపీ రాజకీయల మీద పెద్దగా ఇంటెరెస్ట్ లేదన్నది టాక్. కొత్త పూజరి కన్నా లక్ష్మీ నారాయణకు తన రాజకీయం ఏంటో, బీజేపీ రాజకీయం ఏంటో తెలుసుకునేసరికే టైం అయిపోయేలా వుంది.  అయినా ఏపీ కి ఏం ఇచ్చినా ఇక్కడ వచ్చేదేం లేదన్నది కమలనాధులకు బాగా అర్ధమైపోయింది. దాంతో నిన్న కడప ఉక్కును చెక్కేశారు. రేపు విశాఖ జోన్ కు నై అనేస్తారులా వుంది సీన్ మొత్తం చూస్తూంటే.

Image result for visakha railway zone

ఓడిషాకు కన్ను గీటుతున్న షా
విశాఖ రైల్వే జోన్ అన్నది అంత ఈజీగా వచ్చేదేం కాదు. లాభాల గని వాల్తేర్ డివిజన్ ని ముక్కలు చేసి జోన్ ఇవ్వాలి. అదే జరిగితే  వాల్తేర్ డివిజన్ లాభాలు మొత్తం  కళ్ళ చూస్తున్న పక్కనున్న ఒడిషా కస్సుమంటుంది. రేపటి ఎన్నికలలో కేంద్రంలో మళ్ళీ మోడీ కుర్చీ ఎక్కాలంటే సీట్ల మధ్య తేడా వస్తే కొమ్ము కాసేందుకు బిజూ జనతాదళ్ నవీన్ పట్నాయక్ అక్కరకొస్తాడన్నది బీజేపీ పెద్దల ప్లాన్. అందుకే ఒడిషాను నొప్పించి మరీ ఏపీకి రైల్వే జోన్ ఇచ్చెసేటంత సీన్ లేదంటే లేదక్కడ. తీరా ఇచ్చినా ఏపీలో బీజేపీకి రాలే ఓట్లేమీ లేవు కూడా.


షాక్ ఇచ్చేందుకు రెడీ
 అందుకే తెలివిగా నవీన్ పట్నాయక్ కి బీజేపీ అమిత్ షా కన్ను గీటుతున్నారని టాక్. ఏటా పన్నెడు వేల కోట్ల పై చిలుకు లాభా పంట పండించే వాల్తేర్ డివిజన్ ని ముక్కలు చేయకుండా ఒడిషా కాపు కాస్తూ రాజకీయం చేస్తోంది బీజేపీ. అందువల్ల రేపో మాపో విశాఖకు రైల్వే జోన్ ఇవ్వమని చల్లగా చెప్పేసి షాక్ ఇచ్చేందుకు అమితోత్సాహంతో అమిత్ షా ఉన్నట్లు  ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. మరి ఈ న్యూస్ వినేందుకు అంతా సిద్ధపడిపోవాలి. మరి.  ఎందుకంటే ఏ కౌంటర్లూ లేకుండా లాస్ట్ పంచ్ ఇచ్చేదే బీజేపీ  కనుక.


మరింత సమాచారం తెలుసుకోండి: