పశ్చిమ గోదావరి జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టిన ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొనడానికి వచ్చిన అశేష జనవాహిని చూసి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఉబ్బితబ్బిపోయాడు. అయితే ఈ ఆనందం జగన్ కు ఎంతోకాలం నిలువలేకుండా పోయింది. తమ సామాజిక వర్గానికి చెందిన సభకు రాకుండా జగన్ మమ్మల్ని అవమానపరిచాడంటూ బ్రాహ్మణులు ఆయనకు ఎదురుతిరగడం జగన్ కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది.  


వివరాల్లోకి వెళితే జగన్ తన పాదయాత్ర రాజమహేంద్రవరంలో కొనసాగిస్తాడు అని తెలుసుకున్న  ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు, జగన్ ప్రతినిధులతో చర్చలు జరిపి ఆయన వారు నిర్వహించబోయే సభకి హాజరవుతారు అని క్లియరెన్స్ వచ్చిన తరువాత మొన్న  రాజమహేంద్రవరంలో భారీ ఎత్తున బ్రాహ్మణ ఆత్మీయ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకి రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుండి ఆయా జిల్లాల బ్రాహ్మణ సంఘ నాయకులను సైతం ఆహ్వానించారు. రాజమహేంద్రవరంలో అడుగుపెట్టిన జగన్ తమ సభకి రాబోతున్నాడంటూ చాలా అనందం వ్యక్తం చేశారు. అయితే తీరా జగన్ వారికి హ్యాండ్ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది.


జగన్ వస్తాడని ఎంతో ఆశతో ఎదురుచూసిన వారు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. జగన్ వస్తారనుకొని సభను నిర్వహిస్తే కనీసం ఆయన వివరణ కూడా ఇవ్వకుండా తేలిగ్గా తీసిపారేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెండు రోజుల్లోగా వైసీపీ నేతలు స్పందించాలని లేకపోతే జగన్ కు వ్యతిరేకంగా తమ సామాజిక వర్గాన్ని మలచుతామని గట్టిగా హెచ్చరించారు. గత వారమే రమణ దీక్షితులు జగన్ ను కలిసి తమ సామాజిక వర్గం మద్దతు కూడబెట్టుతా అని చర్చించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ చేసిన ఈ పొరపాటుకు బ్రాహ్మణ సామాజిక ఓట్ల దెబ్బకి జగన్ బలి అవబోతున్నాడని అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: