ఏపీలో బీజేపీ గెలిచిన రెండు సీట్లలో ఒకటైన విశాఖ  మోడీకి ఈసారి షాక్ ఇస్తుందా. ఉత్తరాది ఓటర్లు అధికంగా ఉన్న  మినీ ఇండియా లాంటి వైజాగ్ లో ఓటరన్న తీర్పు కాషాయ పార్టీకి కషాయం మింగిస్తుందా. పరిణామాలు చూస్తూంటే అవుననే సమాధానం వస్తోంది విశాఖ పార్లమెంట్ దేశంలోని ప్రతిష్టాత్మకమైన వాటిలో ఒకటి.గత సార్వత్రిక ఎన్నికలలో ఇక్కడ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్ధి కంభంపాటి హరిబాబు గెలిచారు. టీడీపీతో  కలసి పోటీ చేసిన ఆ ఎన్నికలలో టీడీపీ సపోర్ట్ బాగా కలసివచ్చింది. వైసీపీ తరఫున పోటీ చేసిన జగన్ తల్లి వైఎస్ విజయమ్మను లక్ష ఓట్ల తేడాతో ఓడించి మరీ హరిబాబు నెగ్గారు. అప్పట్లో దేశమంతటా మోడీ ప్రభంజనం వీయడం, స్థానికంగా టీడీపీ పటిష్టంగా నిలవడంతో గెలుపు సులువైంది. ఇపుడు ఎటూ తెలుగుదేశంతో కటీఫ్ అయింది. మోడీ గ్రాఫ్ కూడా బాగా పడిపోతున్న క్రమంలో తిరిగి బీజేపీ గెలవడం మాట దేముడెరుగు, ఒంటరిగా పోటీ పడితే డిపాజిట్లు కూడా దక్కే ఛాన్సే లేదంటున్నారు.

జిఎస్టీ దెబ్బ!

Image result for gst

విశాఖ మహనగరం అన్ని రాష్ట్రాల ప్రజానీకం సమ్మిళితమైనది. పారిశ్రామిక నగరంగా కూడా ఉన్న ఈ ప్రాంతంలో పలు భాషలు మాట్లాడే వాళ్ళు అధికం. ప్రత్యేకించి ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా వుంటారు. ఇక వ్యాపారాలు చేసుకుంటూ నగరంలో జీవించేవారు బాగానే వుంటారు. వీరిలో గుజరాతీలు అధికమే. తమ సొంత రాష్ట్రానికి చెందిన మోడీ ప్రధాని కాబోతున్నారని అప్పట్లో చాల మంది గుజరాతీలు కమలానికి ఓటేశారు. ఈసారి మాత్రం వారిలో బాగా మార్పు వచ్చింది. ప్రధానంగా జీఎస్టీ ప్రవేశపెట్టడంతో వ్యాపార వర్గమంతా తీవ్రంగా వ్యతిరేకతతో ఉంది.తాము ఎట్టి పరిస్థితిలోను బీజేపీకి ఓటు వేయమని నగరానికి చెందిన గుజరాత్ వ్యారులు చెబుతున్నారంటే బీజేపీ పరిస్థితి విశాఖలో ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. అదే బాటలో రాజస్థాన్, మహరాష్త్ర ప్రాంతాలకు చెందిన ప్రజానీకం మోడీ అంటే మందిపడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు, పెట్రోల్, దీజిల్ ధరలు మిన్నంటడం వంటి కారణాల వల్ల బీజేపీ అంటే నాటి అభిమానం తగ్గినట్లు స్పష్టమవుతోంది. 

ఉద్యోగ వర్గాలదీ అదే తీరు

Image result for modi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులెపుడూ కాంగెస్ అభిమానులు, గతసారి దేశవ్యాప్తంగా ఆ పార్టీ వ్యతిరేకత ఉండడం, బీజేపీ నుంచి మోడీ గాలి వీచడంతో అత్యధిక శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జై మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసెందుకు పెట్టుబడుల ఉప సమ్హరణ, వాటల విక్రయం లాంటి నిర్ణయాలు మోడీ సర్కార్ పట్ల అగ్రహాన్ని పెంచాయి. విశాఖకు చెందిన డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ని అమ్మడానికి నిర్ణయం తీసుకోవడం, స్టీల్ ప్లాంట్ లో పది శాతం వాటాలను విక్రయించే ప్రతిపాదనలు, షిప్ యార్ద్ ని సైతం పట్టించుకోకపోవడం వంటి కారణాలతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు వ్యతిరేకమైపోయారు. 

హామీలు నీటి మూటలు !
విశాఖకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయి.  ముఖ్యంగా రైల్వే జోన్ ప్రకటించకపోవడంతో నగరవాసులు గుర్రు మీదున్నారు. అలగే కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు కేటాయించకపోవడం వంటి కారణాలతో గుస్స అవుతున్నారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజ్ కూడ ఇవ్వకపోవడంపైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.    పెద్ద నోట్ల రద్దు, పెట్రోల్, దీజిల్ ధరలు మిన్నంటడం వంటి కారణాల వల్ల బీజేపీ అంటే నాటి అభిమానం తగ్గినట్లు స్పష్టమవుతోంది. అమ్మో మళ్ళీ మోడీకి ఓటా, గెలిస్తే  పెట్రోల్ రేట్ ఈసారి రెండొందలు చెస్తారని జనం సెటైర్లు వేస్తున్నారు. సంస్థాగతంగా కడు బలహీనంగా ఉన్న బీజేపీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఓటేసెందుకు జనం సిధ్ధంగా లేరన్నది వాస్తవం. వీరంతా రేపటి ఎన్నికలలో బీజేపీ వ్యతిరేక వైఖరిని అవలంబించే అవకాశాలు కచ్చితంగా వున్నాయి.. ఇది మోడీకి, బీజేపీకి షాక్ ఇచ్చే పరిణామమే.



మరింత సమాచారం తెలుసుకోండి: