త్వరలోనే ఎన్నికల సంగ్రామం మొదలవనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నేతలందరూ ఓటర్లను కాకా పట్టే పనిలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు అధికార పార్టీ పాలనలోని లోపాలను ఎండగడుతూ, తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం ఇవి చేస్తామంటూ హామీలు ఇస్తుండగా, అధికార పార్టీ మాత్రం తాము చేసిన అభివృద్ది కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన పథకాలే ప్రచారం చేస్తూ ఓట్లర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. 


అయితే అధికార పక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గతంలో  ఊపు మీదున్న ఆంధ్రుల పోరాటాన్ని కూడా తెరమీదకు తెచ్చి తెలుగు వారిని టీడీపీ కి ఆకర్షితులయ్యేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిన్న మంత్రులు, ఎంపీలతో సమావేశమయిన బాబు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం  ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలని వారికి దిశానిర్దేశం చేశాడు. జూలై పదహారు నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవబోతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన వ్యూహాలు బయటపడుతున్నాయి.


ఈ రకంగానే హోదా కోసం తన ఎంపీలతో రాజీనామాలు చేయించిన జగన్ తనదైన వ్యూహంలో పోరాడి ప్రజలలో మంచి మార్కులు కొట్టేసాడు. బాబు కూడా పార్లమెంటు సమావేశాలు మొదలయిన తరువాత జగన్ లాగా తన ఎంపీలతో రాజీనామాలు చేయించి ప్రజలలో టీడీపీ కేంద్రంపై పోరాడుతున్నది అన్న అంశాన్ని బలంగా చొచ్చుకుపోయేలా చేయాలన్న ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అశోక్ గజపతి, సుజనా చౌదరి లచే తమ కేంద్రమంత్రుల పదవులకు రాజీనామా చేయించినప్పటికీ అవి జగన్ చేయించిన రాజీనామాల లాగా ప్రజలలోకి వెళ్లలేదు. ఎలాగూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి  కనీసం ఇప్పుడైనా తన ఎంపీలతో రాజీనామా చేయించి, అరేయ్! టీడీపీ వారు రాష్ట్రం కోసం చాలా చేశారు అని జనాలు అనుకొని సానుభూతితో ఓట్లు వేసేలా బాబు పథకం పన్నినట్లు వాదనలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: