ఇటీవలే రాజకీయ రంగంలో నలభై సంవత్సరాల ను పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుభవానికి తగ్గట్టే రాజకీయప్రణాళికలు, ఎత్తుగడలు వేసి ఇప్పటికీ విజయాలను సాధిస్తున్నాడు. రాజకీయాలలో తనకు ఉన్న అనుభవం ఈ దేశంలో మరెవరికీ లేదని చెప్పుకుతిరిగే బాబు ఇతర పార్టీలను కూడా ఎవరూ ఉపయోగించుకోని రీతిలో వాడి పక్కనేస్తుంటాడు.


ఇంతకుముందు వరకు బీజేపీతో పెట్టుకున్న పొత్తే ఇందుకు మంచి ఉదాహరణ. గత ఎన్నికల్లో  ఎక్కడ మూడు, నాలుగు స్థానాలతో ఓటమిచెంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోతానోఅని భావించి భాజపాతో పొత్తు పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడాడు. చివరికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు రాష్ట్రానికి  హోదా ఇవ్వమని తేల్చేయగా, ఆ విషయాన్ని జనాలలో బాగా చొచ్చుకుపోయేలా జేసి, జనాలు బీజేపీకి ఇంక చచ్చినా ఓటు వేయరు అని నిర్దారించుకున్న తరువాత వారితో పొత్తును విరమించుకున్నాడు.


ఇప్పుడు కూడా బాబు చాకచక్యంగా వ్యవహరించనున్నాడు. ఎలాగూ బీజేపీకి జనాలు ఓటు వేయరు కాబట్టి ఇప్పుడు బాబు, కాంగ్రెస్ తో జత కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులోనే బాబు ప్లాన్ దాగి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మాత్రం హ్యాండ్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే మూడో ఫ్రంట్ కోసం చర్చలు జరుపుతున్న నాయకులతో బాబు చురుగ్గా పాల్గొనడం అందరికీ తెలిసిన విషయమే. నోట్లరద్దు, పెట్రోల్ ధరల పెంపు మరియు తదితర అంశాలలో ప్రజల నుండి బీజేపీకి వ్యతిరేకమవుతున్నది, ఇదిగాక  కేంద్రంలో ఎలాగూ కాంగ్రెస్ వచ్చే అవకాశమే లేదు కాబట్టి కేంద్రంలో మూడో ఫ్రంట్ కు మద్దతిచ్చి దేశ రాజకీయాలలో ఇప్పటినుండి చురుగ్గా వ్యవహరించాలని ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది. ఇక రాష్టంలో వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏ మాత్రం ఎమ్మెల్యేలు  తక్కువైనా రాష్ట్రంలో కాంగ్రెస్ కు వచ్చే మూడు, నాలుగు స్థానాలను ఉపయోగించుకుని లబ్ది పొందాలనే ఆలోచనతో బాబు ఈ జబర్దస్త్ ప్లాన్ వేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: