ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకులు పార్టీ మారడం సహజం. నిజం చెప్పాలంటే అది వారి హక్కులాగా ఫీల్ అవుతుంటారు. చేసేది పనికిమాలిన పని అయినా గొప్ప పనిలా హంగులు ఆర్భాటాలు చేస్తుంటారు. అయితే ఇప్పడూ 2019 లో ఎన్నికలు సమీపిస్తుండటం తో కొంత మంది పార్టీ నేతలు జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అందరికీ కేరాఫ్ అడ్రస్ మాదిరిగా జగన్ గుర్తు వస్తున్నాడు. 

Image result for raghuveera reddy

ఇప్పడు తాజాగా ఆనం రామ నారాయణ రెడ్డి మరియు కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి జుంపింగ్ కు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ కు ఏపీ లో భవిష్యత్ లేదు కాబట్టి రఘువీరా జగన్ వైపు చూస్తున్నాడు. ఏపీలో కాంగ్రెస్‌ పుంజుకోవడం జరగని పని. మొన్నపడ్డ ఓట్లు కూడా ఇప్పుడు పడే పరిస్థితిలేదు. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది కాంగ్రెస్‌నే పట్టుకుని వేళాడుతున్నారు. వీరిలో రెండు మూడు రకాల జనాలున్నాయి. ఒకటి పూర్తిగా ప్రభకోల్పోయిన వారు. వీరు ఏ పార్టీకీ అవసరంలేదు. వేరే పార్టీలు వీళ్లను చేర్చుకోవడానికి ఇష్టపడటంలేదు. వీళ్లను పట్టించుకోవడం లేదు. రెండోరకం.. అంతో ఇంతో విషయం ఉన్న వాళ్లు. వీళ్లు అటు జగన్‌ దగ్గరకు వెళ్లలేరు. వెళ్తే చీప్‌ అయిపోతామేమో అని భయం.

Image result for anam ramanarayana reddy

కాంగ్రెస్‌ పార్టీలో ఉండి వీళ్లు సాధించేది ఏమీలేదు. అయినా కాంగ్రెస్‌లోనే ఉండాల్సి వస్తోంది. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి లాంటివాళ్లు ఈ కేటగిరి. మూడోరకం.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న రకం. ఇక ఇప్పుడు రఘువీరారెడ్డి పరిస్థితి ఈ మూడింటికీ భిన్నంగా ఉందని సమాచారం. ఈయన కాంగ్రెస్‌లో కొనసాగుదామని అనుకుంటున్నా.. పార్టీ ఉండనిచ్చేలా లేదు. పీసీసీ పదవి నుంచి ఈయనను దించేయవచ్చని అంటున్నారు. వాస్తవానికి గత నాలుగేళ్లలో సొంత ఖర్చులు పెట్టుకుని సైతం రఘువీర పార్టీ కార్యక్రమాలు కొన్ని నిర్వహించాడు. అయితే ఇప్పుడు ఈయనను మార్చవచ్చని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: