ఇదీ తెలుగు తమ్ముళ్ళ్ల వాచాలత్వం. దేశానికి ప్రధాని అన్న కనీస గౌరవం, మర్యాదా లేకుండా తెలుగుదేశం నాయకత్వం గత రెండు నెలలుగా పరుష పదజాలంతో విరుచుకు పడుతున్న సంగతి విధితమే. ఆ వరుసలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట రావు కూడా మోడీపై ఘాటైన దైలాగులు పేల్చారు. మోడీ మా బాబు ముందు ఏ  పాటి. మా చంద్రబాబు 1995లోనే సీయం అయ్యారు. మరి మోడీ 2002 లో అయ్యారు. అందువల్ల సీనియర్ మా బాబే అంటూ ఊదరగొట్టారు.

మోడీకి భయం

Image result for MODI

దేశంలో అందరి కన్నా సమర్ధుడు మా బాబు. బాబుని చూసి మోడీ భయపదిపోతున్నారంటూ పంచులూ పేల్చారు. ఎక్కడ బాబు తనకు అడ్డు వస్తోరో అని ఏపీకి కేంద్రం సాయం చేయడం లేదు అంటూ విసుర్లూ విసిరారు. ఏం చేసినా ఏపీని బాబు అభివ్రుధ్ధి చేస్తున్నారు. బాబు శక్తి సామర్ధ్యాలను పరీక్షించవద్దు, సహనానికీ ఓ హద్దు వుంటుందన్నారు.  దేశంలోని పార్టీలను ఏకం చేసె సత్తా వున్న నాయకుడు చంద్రబాబు అని కళా ఎత్తేశారు. బాబు తలచుకుంటే దేశ రాజకీయాలలో కీలక మార్పులు వస్తాయంటూ జోస్యం చెప్పేశారు. 

అధినేత మెప్పు కోసమే..!
అధినేత మెప్పు కోసం నాయకులు ఇలా భారీ డైలాగులు వల్లిస్తూ ఇంతన్నాడు అంతన్నాడు అంటూ రెచ్చిపోతే క్యాడర్ కి ఎం సందేశం ఇస్తారో మరి. అవినీతి పార్టీ వైసీపీ అంటూ అచ్చం బాబు బాణిలోనే ఎంత వల్లే వేసినా జనాలకు అసలు నిజం తెలియద ఏంటి. సిక్కోలులో నిన్నటి వైభవం టీడీపీకి లేదన్న సంగతి కళాకూ తెలుసు.  సైకిల్ కి ఎన్ని రిపేర్లు చేసిన రేపటి ఎన్నికలలో జిల్లాలో చాల చోట్ల పక్చర్లు పడడం ఖాయమంటున్నారు. సొంత పార్టీని చక్కదిద్దుకోవాల్సింది పోయి ఇలా కేంద్రంపై దాడి, వైసీపీ కుమ్మక్కు అంటూ కబుర్లు చెబితే నష్టపోయేది కచ్చితంగా టీడీపీ యే అన్న దాన్ని కళా వంటి పెద్దలు  గుర్తుంచుకుంటే బాగుంటుందని విపక్షంతో పాటు స్వపక్షంలోను సెట్టైర్లు పడిపోతున్నాయి. మరి. చూడాలి ఏపీ అధ్యక్షుడు కళా ఇకనైనా మాటలు తగ్గించి పార్టీని గాడిలో పెడతారో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: