అచ్చం బాబు అనుకున్నట్లుగానే లగడపాటి వారి సర్వే వుందంటున్నారు. బాబు మనసులో దూరి చేసిన సర్వే కానీ ఇది జనం లోంచి వచ్చినది కాదని విపక్షమే కాదు, స్వపక్షమూ ఓ రేంజిలో ఫైర్ అవుతోంది. అందుకు అచ్చమైన ఉదాహరణగా విశాఖ జిల్ల మంత్రి గంటా శ్రీనివాసరావుని చెబుతున్నారు. లగడపాటి సర్వే లో గంటా గెలవడని చెప్పడాన్ని ఎత్తి చూపుతున్నారు. గత కొంత కాలంగా బాబుకు గంటాకు పెద్ద గ్యాప్ ఏర్పడిందన్న టాక్ నడుస్తోంది. దానికి అనుగుణంగానే ఈ సర్వేలో కూడా భీమిలీలో గంటా పరిస్థితి ఏ మాత్రం బాగులేదని చెబుతోంది. అంటే ఈ సర్వేను అడ్డం పెట్టుకుని బాబు టిక్కెట్ల రాజకీయం షురూ చేస్తారని గంటా వర్గం వూహిస్తోంది.

అక్కడ బాబు మాత్రం భేష్ 

Image result for lagadapati SURVEY

లగడపాటి సర్వేను టీడీపీ తమ్ముల్లే విశ్వసించడం లేదు. ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పని తీరు పూర్ గా వుందని చెప్పిన సర్వే అదే చోట ముఖ్యమంత్రిగా బాబు పని తీరుకు మాత్రం నూరు మార్కులూ వేసేస్తోంది. దీనిని బట్టే ఈ సర్వే ఎంత లోపభూయిష్టంగా వుందో అర్ధం అవుతోందని తమ్ముళ్ళే విసుక్కుంటున్నారు. అంటే తాను టిక్కెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్న చోట సదరు ఎమ్మెల్యేను ముందుగనే పనికిరాడని చెప్పేందుకే ఈ సర్వే బాబుకు ఉపయోగపడేల వుందని కూడా అనుమానిస్తున్నారు.

వ్యతిరేకత కనబడలేదా
విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో రెండు  తప్ప ఇపుడు అన్నీ టీడీపీ చేతిలోనే వున్నాయి. చాలమంది ఎమ్మెల్యేల పట్ల జనంలో వ్యతిరేకత బాహటంగానే కనిపిస్తోంది. అయితే సర్వేల ఘనాపాఠి లగడపాటికి మాత్రం ఆపాటి కూడా కనిపించకపోవడం విడ్డూరమేనని అంటున్నారు చిత్రమేమిటంటే సీయం మాత్రం సూపరట. ఎమ్మెల్యేలు మాత్రం  దౌట్ అంట. కానీ మళ్ళీ అక్కడ టీడీపీయే గెలుస్తుందంట. ఈ చిత్రమైన సర్వేని సొంత పార్టీతో సహా ఎవరూ పట్టించుకోకపోవడం బాబు అండ్ కోకు పెడ్డ షాకే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: