రాబోయే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరొకవైపు తెలుగుదేశం పార్టీ భజనచేసే మీడియా టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసిపి-బిజెపి పార్టీలు కలసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తున్నాయని విషప్రచారం చేస్తుండటంతో వైసిపి ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పడకుండా వారి ట్రాప్ లో పడకుండా స్టేట్మెంట్ ఇచ్చి క్లారిటీ ఇచ్చింది. గతంలోనే నెల్లూరు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి మనకు తెలుసు..అయితే తాజాగా మరొకసారి చంద్రబాబు ఎల్లో మీడియా కలిసి విషప్రచారం చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల పొత్తులు విషయమై స్పష్టమైన ప్రకటన చేసింది.
Image result for ysrcp padayatra
గత కొన్ని నెలలకు ముందు చంద్రబాబు బీజేపీ పార్టీలు కలసి రాష్ట్రంలో రాజకీయాలు రాణించారు.. ఈ విషయం మనకందరికీ తెలుసు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా అధికారపార్టీకి  వ్యతిరేకంగా మారటంతో ...ఆ ప్రజావ్యతిరేకతను బిజెపి పార్టీ పై డైవర్ట్ చేసి ఎన్డీయే కూటమి నుండి తెలివిగా చంద్రబాబు బయటకు వచ్చేయడం జరిగింది.
Image result for chandrababu
ఈ నేపధ్యంలో చంద్రబాబు కేంద్రంపై రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకతను వైసీపీ పై నేటడానికి.. వైసీపీ-బీజేపీ పార్టీలు కలిసిపోతున్నాయి అన్న ప్రచారానికి తెరలేపడంతో...ముందుగా వైసీపీ నేతలు ఈ విషప్రచారాన్ని గ్రహించి రాష్ట్ర ప్రజల మైండ్ డైవర్ట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ పార్టీకి జగన్ పాదయాత్ర ద్వారా రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో ఈ ఆదరణను చూసి తట్టుకోలేక చంద్రబాబు అనేక కుట్రలు పన్నుతున్నారు అని అంటున్నారు వైసీపీ నేతలు.
Image result for chandrababu jagan padayatra
ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికలలో రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబుని ఇంటికి పంపించి.. రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందు నుంఛి పోరాడుతున్న వైసీపీ అధినేత జగన్ ని రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రిగా చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు వైసిపి నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: