గత నాలుగు సంవత్సరాల కిందట దేశంలో ఎన్నికలు జరుగకముందు ప్రచార సన్నాహాకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనూ  ప్రచారం నిర్వహించిన ప్రధాని మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రమాణం చేసాడు. అయితే ఇప్పుడు మాత్రం మాట మార్చి తామెప్పుడూ అటువంటి వాగ్దానమే చేయలేదని ఆయన చెప్పడం గమనార్హం. అంతేగాక అసలు రాష్ట్రానికి హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసారు. 


హోదా సంగతి అటుంచితే విభజన చట్టంలోని హామీలను కూడా మోడీ సర్కారు విఫలమయింది. రాష్ట్రానికి ఉక్కు  ఫ్యాక్టరీ, రైల్వేలైను లను మంజూరుచేస్తామని చెప్పి కుచ్చు టోపీ పెట్టారు. కనీసం కడప ఉక్కు పరిశ్రమనైనా నెలకొల్పాలని అధికార టీడీపీ నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు.


రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని చంద్రబాబు ఆ లేఖ ద్వారా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. విభజన హామీలలో ఉన్న కడప ఉక్కు పరిశ్రమను తక్షణమే రాష్ట్రానికి మంజూరు చేయాలని ఆయన కోరారు. పరిశ్రమను ఏర్పాటుచేయు నిమిత్తం సుప్రీంకోర్టులో రివైజ్డ్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకోసం మెకాన్ సంస్థ నివేదికను పరిగణించాలని ఆయన ఈ మేరకు లేఖలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: