ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ నేపద్యంలో తాను రాసిన లేఖను ఢిల్లీకి పంపడం జరిగింది. ఇంతకి ఆ లేఖలో చంద్రబాబు రాసినది ఏమిటంటే వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు కర్మాగారం మరియు అదే విధంగా విభజనకు గురి కావడంతో రాష్ట్రం తీవ్రంగా రెవిన్యూ లోటుతో పొందని ఈ క్రమంలో రెవెన్యూ లోటును భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు కోరారు.
Image result for chandrababu modi
అదే విధంగా విభజన సమయంలో  ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రధాని మోడీ ని కోరారు చంద్రబాబు. కాగా.. ఇటీవల నీతి అయోగ్ సమావేశం కోసం సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయ్యి రాష్ట్ర సమస్యలన్నీ నిశితంగా వివరించాల్సింది పోయి.. అంతా అయిపోయిన తర్వాత అమరావతికి వచ్చి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
Image result for chandrababu modi
మరోవైపు సోషల్ మీడియాలో సైతం ఈ లేఖ వ్యవహారంలో సెటైర్లు పేలుతున్నాయి. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ మొదలుకుని అవిశ్వాస తీర్మానం వరకూ అన్నింటిలోనూ చంద్రబాబు అలక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని.. ఇన్ని రోజులు సీఎం మౌనంగా ఎందుకున్నారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు..
Related image
చంద్రబాబు ఎప్పుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి ఇదే వైఖరి అనుసరిస్తారని అంటున్నారు ఢిల్లీలో ఒకలాగా రాష్ట్రానికి వచ్చాక మరో కల చంద్రబాబు వుంటారని ప్రతిపక్ష పార్టీ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులు అన్ని రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని అంటున్నారు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: