' వైఎస్ వేరు..జ‌గ‌న్ వేరు..రాజ‌కీయంగా జ‌గన్ పై దాడులు చేయండి ...తాజాగా వైఎస్సార్ సిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై రాహూల్ గాంధి చేసిన వ్యాఖ్య‌లు. ఏపి కాంగ్రెస్ నేత‌ల‌తో ఢిల్లీలో రాహూల్ స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప‌రిస్దితిపై స‌మీక్షించిన‌పుడు పై వ్యాఖ్య‌లు చేశారు. అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటి (ఏఐసిసి) అధ్య‌క్షుడు రాహూల్ గాంధీ త‌న రాజ‌కీయ అప‌రిప‌క్వ‌త‌ను మ‌రోసారి చాటుకున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ వేరు ఆయ‌న కొడుకు వైఎస్ జ‌గ‌న్ వేర‌ట‌. ఎవ‌రైనా న‌వ్వుతార‌న్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రాహూల్ మాట్లాడుతున్నారు. 


విభ‌జ‌నతోనే కాంగ్రెస్ కు క‌ష్టాలు

Related image

ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు విరుద్దంగా ఏపిని విభ‌జించ‌టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆ విష‌యాన్ని ఇప్ప‌టికీ రాహూల్ గుర్తించలేదా లేక‌పోతే గుర్తించ‌న‌ట్లు న‌టిస్తున్నారా అన్న‌ది అనుమానం. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు జ‌నాలు ఘోరీ క‌ట్టిన  ప‌ద్ద‌తిని చూసిన త‌ర్వాత కూడా ఏపికి తాము చేసిన ద్రోహ‌మేంటో రాహూల్ తెలుసుకోలేక‌పోతే చేసేదేం లేదు. వైసిపిలోకి వెళ్ళిన కాంగ్రెస్ నేత‌ల‌ను వెన‌క్కు ర‌ప్పించండి అని రాహూల్ చెప్ప‌టంలోనే పార్టీ ప‌రిస్దితి ఎంత ద‌య‌నీయంగా ఉందో అర్ధ‌మైపోతోంది. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని జ‌నాలు ఇప్ప‌ట్లో మ‌ర‌చిపోతారా అన్న‌దే ప్ర‌శ్న‌.


టిడిపితో పొత్తు ఖాయ‌మేనా ?

Image result for rahul and chandrababu

కాంగ్రెస్ పై జ‌నాలు మండుతున్నంత  కాలం పార్టీకి పూర్వ వైభ‌వం అన్న‌దే ఉండ‌ద‌న్న విష‌యం  అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుత ప‌రిస్ధితుల ప్ర‌కార‌మైతే తాము కాంగ్రెస్ నేత‌ల‌మ‌ని చెప్పుకోవ‌టానికే చాలా చోట్ల నేత‌లు మొహ‌మాట ప‌డుతున్నారు. వాస్త‌వం ఇలాగుంటే, జ‌గ‌న్ ను వ్య‌తిరేకించండి, కాంగ్రెస్ నేత‌ల‌ను వెన‌క్కు ర‌ప్పించండి అని చెబితే కాంగ్రెస్ బ‌లోపేత‌మైపోతుందా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా కాంగ్రెస్ కు ఒక్క అసెంబ్లీ సీటైనా ద‌క్కుతుందా అన్న‌దే అనుమానం. వైసిపిపై మెత‌క వైఖ‌రి వ‌ద్ద‌ని చెప్ప‌టంలోనే రాహూల్ రాజ‌కీయంగా ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలిసిపోతోంది. అధికార పార్టీ టిడిపి వైఫ‌ల్యాల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌ధాన ప్రతిప‌క్ష‌మైన వైసిపి వైఫ‌ల్యాలను ఎండ‌గ‌ట్టండి అని చెప్ప‌టంలోనే రాహూల్ ఉద్దేశ్య‌మేంటో అర్ద‌మైపోతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్-టిడిపి పొత్తుంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌ధ్యంలో రాహూల్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధ‌న్య‌త వ‌స్తోంది. పైగా వైఎస్సార్ పై అభిమానంతో జ‌గ‌న్ ను వ‌దిలిపెట్ట‌కండి అని రాహూల్ చెప్ప‌టం విచిత్రంగ  ఉంది. ఢిల్లీలో కూర్చుని రాహూల్ ఎన్ని మాట‌లైనా చెబుతారు. రాష్ట్రంలో తిరిగే వారికే క‌దా తెలిసేది స‌మ‌స్య‌లేంటో ?  వైఎస్ వేరు జ‌గ‌న్ వేరంటే జ‌నాలు ఒప్పుకుంటారా ? ఇందిరాగాంధి, రాజీవ్ గాంధి వేరు తాను వేర‌ని రాహూల్ గాంధి చెప్పుకోగ‌ల‌రా ? 


మరింత సమాచారం తెలుసుకోండి: