తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న అమెరికా షికాగో సెక్స్ రాకెట్ తో నారా లోకేష్ కు సంబంధాలున్నాయా ? అమెరికా పోలీసులు సెక్స్ రాకెట్ పై ప‌దే ప‌దే విచారిస్తున్న వేమ‌న స‌తీష్ ఇటు చంద్ర‌బాబునాయుడుతో పాటు అటు కొడుకు లోకేష్ కు బాగా స‌న్నిహితుడా ?  వైసిపి అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం అలాగ‌నే అనుకోవాలి. ఎందుకంటే, చంద్ర‌బాబుతో వేమ‌న స‌తీష్ స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను ప‌ద్మ చూపుతున్నారు మ‌రి. ఫొటోల్లో ఉన్న దాన్ని బ‌ట్టి స‌తీష్-చంద్ర‌బాబులు బాగా స‌న్నిహితుల‌నే అనుకోవాలి. 


స‌తీష్-చంద్ర‌బాబు బంధం

Image result for chandrbabu and vemana satish

అదే విష‌య‌మై ప‌ద్మ మాట్లాడుతూ, అమెరికాలో బ‌య‌ట‌ప‌డిన సెక్స్ కుంభ‌కోణంలో ఏపిలోని ప‌లువురు కీల‌క వ్య‌క్తులున్నారంటూ ఆరోపించారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) త‌ర‌పున  స‌తీష్ అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుంటారు. ఆ ముసుగులో ప‌లువురు హీరోయిన్లు, యాంక‌ర్ల‌ను సెక్స్ రొంపిలోకి దింపుతున్న విష‌యం వెలుగు చూసింది. అమెరికా పోలీసులు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఈ కేసు బ‌య‌ట‌ప‌డ‌గానే తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.


కాల్ మ‌నీ సెక్స్ కుంభ‌కోణ‌మా ?

Image result for call money sex racket

సెక్స్ కుంభ‌కోణంలో త‌న స‌న్నిహిత మిత్రుడున్న కార‌ణంగా చంద్ర‌బాబు ఏపి జనాల‌కు స‌మాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు ప‌ద్మ‌. ఇటువంటి  కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ‌టం ద్వారా అమెరికాలో ఉంటున్న తెలుగు వాళ్ళ ప‌రువు పోతోందంటూ వాసిరెడ్డి తెగ బాధ‌ప‌డిపోయారు. గ‌తంలో ఏపిలో  బ‌య‌ట‌ప‌డిన కాల్ మనీ సెక్స్ కుంభ‌కోణం కేసులో ప‌లువురు అధికార పార్టీ నేత‌లున్న కార‌ణంగానే కేసు నీరుగారిపోయిందంటూ మండిప‌డ్డారు. కాల్ మనీ సిఎం అని త‌మ ఎంఎల్ఏ రోజా అన్నందుకే అప్ప‌ట్లో ఏడాది పాటు నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా అసెంబ్లీ నుండి స‌స్పెండ్ చేసిన విష‌యాన్ని కూడా ప‌ద్మ గుర్తుచేశారు. అమెరికాలోని సెక్స్ రాకెట్ తో సంబంధాలున్న స‌తీష్ తో స‌న్నిహిత సంబంధాలున్న కార‌ణంగా చంద్ర‌బాబును ప్ర‌తీ మ‌హిళా కాల్ మ‌నీ సిఎం అని పిల‌వాల్సొస్తోందంటూ ప‌ద్మ ధ్వ‌జ‌మెత్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: