జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్రరాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా తనవైపు కి అనుకూలంగా మార్చుకున్నాడు. ఇదే క్రమంలో గత ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబుని ప్రజలు కూడా తీవ్రంగా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది మరోపక్క జగన్ పాదయాత్రకు జనం నీరాజనం పడుతున్నారు. ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు ఈ నెలాఖరున విశాఖ జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు….ఈ క్రమంలో జగన్ విశాఖజిల్లా వేదికగా అనేక సంచలనాలకు తెర తీస్తున్నారు.
Image may contain: 14 people, people smiling, people standing, shoes and outdoor
ముఖ్యంగా గత ఎన్నికలలో విశాఖ జిల్లాలో ఓటమి లేని వైఎస్ కుటుంబం ఓడిపోవడంతో జగన్ ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.  ఈ నెలాఖరుకు తూ . గో జిల్లాలో జగన్ తన పాదయాత్ర ను పూర్తి చేసుకుని విశాఖలో అడుగు పెట్టనున్నారు. పాదయాత్ర విశాఖ చేరుకున్న సమయంలోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభలోనే ముఖ్య నేతలను చేర్చుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
Image may contain: 8 people, people smiling, people standing and outdoor
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి , శ్రీకాకుళం కి చెందిన కోండ్రు మురళీ మోహన్ , ఉత్తరాంధ్ర ముఖ్య నాయకుడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ , విశాఖ జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రతి నిధి అనంత పురం జిల్లా హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ తో పాటు పలువురు ముఖ్య నేతల చేరికలు ఇప్పటికే ఖాయమయ్యాయి. విశాఖ లో జరిగే భారీ బహిరంగ సభలో వీరందరిని చేర్చుకోవడం వలన పార్టీ కి ఊపు తీసుకురావడం తో పాటు ప్రత్యర్థులకు సవాల్ విసరాలని నిర్ణయించినట్లు సమాచారం.
Image may contain: 8 people, people smiling, people standing, shoes and outdoor
ఇప్పటివరకూ జరిగిన జగన్ పాదయాత్ర ఒక ఎత్తు , విశాఖ నుంచి జరిగే పాదయాత్ర మరో ఎత్తు అని అంటున్నారు వైసీపీ పార్టీ సీనియర్ నేతలు...పాదయాత్ర చివరికి వచ్చేపాటికి వైసీపీ పార్టీ లోకి భారీగా చేరికలు ఉంటాయని చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు ఇప్పటికే తమతో టచ్  లో ఉన్నారని అంటున్నారు వైసీపీకి చెందిన నాయకులు. మొత్తంమీద చూస్తుంటే జగన్ విశాఖ వేదికగా చంద్రబాబుకి గట్టిగానే షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: