ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై భారీ ఎత్తున ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే.  సెలబ్రిటీలపై హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ లైంగిక వేధింపులు - అత్యాచారాల నేపథ్యంలో `# మీ టూ` ఉద్యమం వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేవలం సినిమా రంగంలోనే కాదని - ఐటీ కంపెనీలతో సహా దాదాపుగా మహిళలు పనిచేసే ప్రతిచోట ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడుస్తోందని మహిళా లోకం గళం అగ్గిలం మీద గుగ్గిలం అవుతుంది.  హాలీవుడ్,బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా జరుగుతుందని తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నాయి. 
Related image
తాజాగా బ్యాంకుల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం బట్టబయలు కావడం తీవ్ర కలకలం రేపింది. క్రాప్  లోన్ కోసం బ్యాంకుకు వచ్చిన ఓ మహిళకు ఆ బ్యాంకు మేనేజర్ నుంచి `క్యాస్టింగ్ కౌచ్` ఎదురవడం పెను దుమారం రేపింది.  అయితే ఇలాంటి సంఘటనలు కొన్ని చోట్లు జరుగుతున్నా మహిళలు వారి హింస భరిస్తున్నారని..కొన్ని చోట్ల మహిళలు బ్యాంకుకు వెళ్లాలంటేనే భయపడుతున్నారన్న వార్తలు వచ్చాయి.  కానీ, మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ మహిళ చేసిన ధైర్యంతో బ్యాంక్ మేనేజర్ చిక్కుల్లో పడ్డాడు. 

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న మలకాపూర్ లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రాప్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఓ రైతుతో పాటు అతడి భార్య కూడా వెళ్లింది. తమకు లోన్ మంజూరు చేయాల్సిందిగా వారు బ్రాంచ్ మేనేజర్ రాజేష్ హివాసేను సంప్రదించారు. దరఖాస్తు పూర్తిచేసే నెపంతో ఆ మహిళ నెంబరును రాజేష్ తీసుకున్నాడు.  ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ తన కామరూపాన్ని బయట పెట్టాడు..ఆ మహిళలకు తరుచూ ఫోన్ చేస్తూ.. అసభ్యకరంగా మాట్లాడుతూ - తన లైంగిక వాంఛ తీరిస్తే లోన్ మంజూరు చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఆ తర్వాత - తన బ్యాంకులో పనిచేసే ప్యూన్ ను ఆ మహిళ ఇంటికి పంపించి రాయబారం నడిపాడు. 
'Sex Favours From Farmer's Wife': Bank Manager in Maharashtra Sets Obscene Condition to Sanction Crop Loan, Gets Booked
అయితే లోన్‌ జారీఅయ్యే సమయంలో గొడవ కావటం ఇష్టం లేని ఆమె విషయాన్ని భర్తకు చెప్పలేదు. రుణంతోపాటు అదనంగా లాభాలు, కొంత ప్యాకేజీ కూడా మేనేజర్‌ ద్వారా ఇప్పిస్తానని సదరు ప్యూన్‌ ఆమెతో చెప్పాడు. అతని మాటలు వినగానే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటబడి రోకలిబండతో అతన్ని తరిమి కొట్టింది.  అంతే కాదు బ్యాంకు మేనేజర్ ఫోన్ సంభాషణను రికార్డు చేసిన ఆ మహిళ....అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో - బ్యాంకు మేనేజర్ రాజేష్ - ప్యూన్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: