ప్రస్తుత రోజుల్లో మనకు తెలియని విషయాలు తెలుసుకోవాలంటే చాలామంది అంటుండే విషయం గూగుల్ చేయి తెలిసిపోతుందని. అయితే తాజాగా అంతర్జాతీయ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఆంధ్రప్రదేశ్ 2019 ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేస్తుంది. ఎన్నికల జరగకముందే ఇంటర్నేషనల్ సెర్చ్ ఇంజన్ గూగుల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ 2019 ముఖ్యమంత్రి అని డిసైడ్ చేసేసింది.

Related image

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు...దానికి గల కారణం గత ఎన్నికలలో అధికారమే పరమావధిగా భావించి ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్రరాష్ట్రాన్ని తన రాజకీయ లబ్దికోసం మోసం చేయడమే. మరియు అదే విధంగా మరో పక్క ప్రతిపక్షనేత వైయస్ జగన్ చంద్రబాబు చేస్తున్న మోసాలపై చిత్తశుద్ధితో ప్రజలలో ఉండి పోరాడుతు చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రతి అవినీతి కార్యక్రమాన్ని బట్టబయలు చేస్తూ ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే తానే విధంగా పరిపాలిస్తాడో క్లారిటీగా ప్రజలకు చెబుతూ ముందుకు దూసుకుపోతున్నారు.

Image result for google images

ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజా సంకల్ప పాదయాత్ర అంటూ జగన్ తలపెట్టిన ఈ పాదయాత్ర వల్ల ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి అని అనటంలో సందేహం లేదు. అయితే 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అని సెర్చ్ చేస్తే మాత్రం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేరుతో పాటు ఆయన ఫోటోలు కనిపిస్తున్నాయి.

Related image

ఇప్పుడు ఈ విషయమే పచ్చ వర్గాలకు కిర్రెక్కిస్తోంది. జాతీయ స్థాయి మీడియా సర్వేలన్నీ కూడా 2019లో వైకాపాదే గెలుపు అని తేల్చేసిన నేపథ్యంలో సొంత భజన మీడియా లో ఏదో సర్వే చేయించాం అని చెప్పి 2019లో టిడిపిదే గెలుపు……బాబే సిఎం అని కథలు చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర రాజకీయాలలోనే కాక దేశ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నరు.



మరింత సమాచారం తెలుసుకోండి: