విశాఖ జిల్లాలో జనసేనాని మలి విడత ప్రజా పోరాట యాత్రకు రెడీ అయ్యారు. గురువారం నుంచి ఆయన టూర్ మొదలైంది. అయితే తొలి విడత, మలి విడత టూర్ కి మధ్యలో  రాష్ట్ర రాజకీయాలు స్పీడ్ అయిపోయాయి.   ఓ సర్వే జన సేనకు గెలుపు అవకాశాలు లేవని చెప్పడమే కాదు, అతి తక్కువ ఓట్ల శాతమే వస్తుందని అంచనా కట్టింది ఓ సర్వే. దీనికి తోడు ఈ మధ్యనే బాబుతో పవన్ కలసి ఓ దైవ సంబంధ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా ఈ ఇద్దరికీ కావాల్సిన ఓ ప్రముఖుడు కలిపారని ప్రచారం జరిగింది. 


తొలి విడతలో బాబుపై ఓ రేంజిలో చెలరేగిన పవన్ ఇపుడు తన బాణాలను ఎవరిపైన ఎక్కుపెడతారంటూ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బాబుపై సుతి మెత్తని కామెంట్స్ మాత్రమే చేస్తే పవన్ భవిషత్తు వ్యూహం ఏంటన్నది చెప్పేయచ్చు. జగన్ తో చెలిమి అని మరో టాక్ కూడ నడుస్తున్న  టైంలో వైసీపీ ఆధినేత పైన ఫైర్ అయితే మాత్రం పాత పవన్ న్నే మళ్ళీ చూడొచ్చు. మొత్తానికి పవన్ టూర్ ఎన్నో ప్రశ్నలకు జవాబు కానుంది.
Related image
అక్కడ నుంచే ఎందుకంటే 
విశాఖ  జిల్లాలో రాజకీయంగా చైతన్యం కలిగిన అనకాపల్లి నుంచి పవన్ రంగంలోకి దిగుతున్నారు. జిల్లా నాడి పట్టుకోవాలంటే ఇక్కడే ఒడిసి పట్టాలి. పైగా ఇక్కడ జనాలకు అందరి జాతకాలు బాగా తెలుసు. కొత్త వారిని ఆదరిస్తారు కూడా. పవన్ సామాజిక వర్గం అధికంగా వున్న ప్రాంతమిది.  పైగా జిల్లాలో  రాజకీయ ఉద్దండులైన ఇద్దరు మాజీ మంత్రులు దాడి వీరభద్ర రావు, కొణతాల రామక్రి ష్ణ అనకాపల్లికి చెందిన వారే. పైగా ఇద్దరూ ఇపుడు పొలిటికల్ క్రాస్ రోడ్లో వున్నారు. మరి జనసేనాని  సూదంటు రాయిగా ఆకట్టుకుంటారో లేదో చూడాలి. అసలు ఆయన రాజకీయం  ఏంటో  తెలియదు కానీ అనకాపల్లిని ఎంపిక చేసుకున్నారు. 

కలకలం రేపుతారా
పవన్ ఇప్పటికి రెండు జిల్లాల టూర్ పూర్తి చేసారు. జనమైతే బాగానే స్పందించారు కానీ, ఇతర పార్టీల  నాయకుల నుంచి కదలిక లేదు. తాను జనంలోకి వస్తే చాలు అన్ని పార్టీల నుంచి గంప గుత్తంగా లీడర్స్ పొలోమంటూ వచ్చేసి పార్టీలో చేరిపోతారని పవన్ భారీగా  వూహించేసుకున్నారు. కానీ జరిగింది వేరు. ఎంత సేపూ టీడీపీ, వైసీపీ తప్ప మూడవ పార్టీ వైపుగా తొంగి చూడని పరిస్థితి. దీంతో జనసేనాని ఖంగు తిని ఏకంగా టూర్ కి లాంగ్  గ్యాప్ ఇచ్చేశారని టాక్.

పెద్ద తలకాయ ఒకటీ లేదు 
పవన్ తప్ప జనసేనలో రెండో నాయకుడు ఎవరు లేరన్నది నిజం. గోదావరి జిల్లాల తరువాత పవన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది ఉత్తరాంధ్ర మీదనే. ప్రజారాజ్యం నుంచి ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే, ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే నాటి కేంద్ర మంత్రి పురంధేశ్వరినే డీ కొట్టి రెండవ స్థానం దక్కింది. బలమైన సామజిక వర్గానికి తోడు, మూడు జిల్లాలోనూ  మెగా ఫ్యాన్స్ ఎక్కువగా వున్నారు. అయినా సరే ఒక్కరంటే ఒక్కరు ఇంత వైపూ జనసేన వైపు తొంగి చూడకపోవడం ఆశ్చర్యమే.

ఈసారి సంచలనాలుంటాయా ?
దాదాపుగా ఇరవై రోజుల తరువాత పవన్ మళ్ళీ జనంలోకి వస్తున్నారు. విశాఖ జిల్లాలో రాజకీయం మారుతోంది. అధికార పార్టీపై ఏకంగా మంత్రి గంటా గుస్సా మీదున్నారు. ఇక అనకాపల్లిలోనే ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గోడ దూకాలనుకుంటున్నారు. అదే వరుసలో పవన్ సామజిక వర్గానికి చెందిన వారు, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కొనసాగిన వారు బోలెడు మంది వున్నారు. ఇక తటస్థంగా వున్న లీడర్లకు కొదవ లేదు. వీరిలో ఎంత మందిని పవన్ ఆకర్షిస్తారన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: