నారా లోకేష్ ఎట్టకేలకు తానూ 2019 లో పోటీ చేయబోతున్నానీ ప్రకటించాడు. అయితే నారా లోకేష్ పోటీ చేయడానికి ఇప్పటివరకు చాలా నియోజక వర్గాలు పరిశీలించినారు. చివరికి చంద్ర బాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం స్థానం ఖరారు చేసినట్టు తెలుస్తుంది.అయితే కుప్పం నియోజక వర్గం టీడీపీ కి తిరుగులేని స్థానంగా చెప్పుకోవచ్చు. పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌పై లోకేష్ దృష్టి ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Image result for nara lokesh

అనంత‌పురం జిల్లాలోని హిందుపురం మొద‌టిది. ఈ నియోజ‌క‌ర్గం టిడిపికి కంచుకోట లాంటిది. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఒక్క‌సారి కూడా ఓడలేదు. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వాళ్ళిద్ద‌రూ ఎటూ మామా అల్లుళ్ళే కాబ‌ట్టి లోకేష్ పోటీకి బాల‌కృష్ణ అభ్యంత‌రం పెట్ట‌క‌పోవ‌చ్చు. ఇక‌, రెండోది కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌స్తుతం ఇక్క‌డ బోడెప్ర‌సాద్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

Image result for nara lokesh

మూడో నియోజ‌క‌వ‌ర్గం క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల కాగా నాలుగోది చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గం. నియోజ‌క‌వ‌ర్గంలోని బూత్ లెవ‌ల్ కమిటీల‌తో కూడా లోకేష్ రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉన్నారు.. అందులోను కుప్పంక‌న్నా లోకేష్ కు రాష్ట్రం మొత్తం మీద‌ సేఫ్ సీటు మ‌రొక‌టి దొర‌క‌దు. బ‌హుశా వ‌చ్చే ఎన్నిక‌లే చంద్ర‌బాబుకు చివ‌రి ఎన్నిక‌లు కావ‌చ్చు. అందుక‌నే త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని లోకేష్ కు అప్ప‌గించి చంద్ర‌బాబు పైన చెప్పిన ఏదో ఒక నియోజ‌వ‌ర్గంలో పోటీ చేసే అవ‌కాశ‌ముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: