కేంద్రం వైఖరి ఏంటో స్పష్టముగా అర్ధం అయిపొయింది. కష్టాల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కు సాయం చేసే ఉద్దేశం కేంద్రం కు లేదని విషయం తెలిసి పోయింది. నిజంగా చెప్పాలంటే బీజేపీ తనకు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలకే లభ్ది చేకూర్చుతుంది తప్ప తనకు పట్టు లేని ముఖ్యముగా దక్షిణాది రాష్ట్రాల్లో పక్ష పాతం చూపిస్తుందన్న సంగతీ అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ఇప్పడూ ఈ దీక్షలు అని ఎందుకు హడావిడి చేస్తుందో తెలియడం లేదు. నాలుగేళ్లు బీజేపీ కలిసి ఉన్నప్పుడు ఏమి అడగలేని ఇదే పార్టీ ఇప్పడూ దీక్షలు అని చెబితే బీజేపీ తలొగ్గుతుందా... లేక ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా...!

Image result for tdp and bjp

ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర‌మంత్రిని ఎంపిలు ఢిల్లీలో క‌లిశారు. ఫ్యాక్ట‌రీ ఏర్పాటుపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అయితే, స‌మావేశంలో ఎంపిలు ఆశించిన మేర‌కు కేంద్ర‌మంత్రి స్పందించ‌లేద‌ని ఎంపిలు మండిప‌డుతున్నారు. ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటులో జ‌రుగుతున్న జాప్యంపై ఎంపిలు కేంద్ర‌మంత్రిని నిల‌దీశారు. ఫ్యాక్ట‌రీ ఏర్పాటు ఎప్ప‌టిలోగా మొద‌లుపెడ‌తారో చెప్పాలంటూ ఎంపిలు నిల‌దీయ‌గా కేంద్ర‌మంత్రి తోసిపుచ్చారు.

Image result for tdp and bjp

కేంద్ర‌మంత్రితో భేటీ త‌ర్వాత మ‌చిలీప‌ట్నం ఎంపి కొన‌క‌ళ్ళ నారాయ‌ణ మాట్లాడుతూ, బీరేంద్ర స్పంద‌నపై మండిప‌డ్డారు. కేంద్ర‌మంత్రితో జ‌రిగిన స‌మావేశంపై తాము పూర్తిగా అసంతృప్తితో ఉన్న‌ట్లు చెప్పారు. ఏదో ఒక కార‌ణం చెబుతూ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు విష‌యంలో కేంద్రం జాప్యం చేస్తున్న‌ట్లు ఎంపి ఆరోపించారు. ఎప్ప‌టిలోగా ఫ్యాక్ట‌రీ నిర్మాణం మొద‌ల‌వుతుందో చెప్ప‌మంటే కేంద్ర‌మంత్రి చెప్ప‌లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు కొన‌క‌ళ్ల‌.


మరింత సమాచారం తెలుసుకోండి: