పవన్ కళ్యాణ్ ప్రస్థుతం ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్నాడు. అయితే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం గురించి మాట్లాడుతున్నాడు. రాయలసీమ కు వెళ్ళినప్పుడు అనంత పురం వెనుకబాటు తనంగురించి మాట్లాడుతాడు. అయితే ప్రతి ప్రాంతానికి వెళ్లి ఈ ప్రాంతం వెనుక బడిందని, పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శలు చేస్తున్నాడు. అయితే ఇలా మాట్లాడటం వల్లనా పవన్ కళ్యాణ్ విమర్శలు మూట గట్టుకుంటున్నాడు. 

Image result for pavan kalyan and janasena

కాగా ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ వేదికగా ఉత్తరాంధ్ర రానున్న కొన్నేళ్లలో మరొక తెలంగాణా మాదిరి ప్రత్యేక రాష్ట్రంగా ఉద్భవించే అవకాశం లేకపోలేదని జోస్యం చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడిని రేపుతున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఉత్తరాంధ్ర మాస పత్రికలో వచ్చిన కధనాన్ని ఉదహరిస్తూ ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. 

Image result for pavan kalyan and janasena

కాగా మరికొన్ని ఏళ్లకు, లేదా అంతకంటే ముందే కూడా ఉత్తరాంద్ర ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారే అవకాశం చాలావరకు ఉందని, పాలకులు ప్రజలను నిర్లక్ష్యం చేయవద్దని హితవు పలికారు. అయితే పవన్ అవగాహనా మరిచి మాట్లాడుతున్నారని, కాని ప్రస్తుతం తమ టీడీపీ ప్రభుత్వ నేతలు ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి వాటిని పరిష్కరిస్తున్నారని చెపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: