ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద‌మమై దీక్ష మ‌రోటి లేద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తాన‌ని టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు సిఎం ర‌మేష్ ప్ర‌క‌టించ‌గానే ప్ర‌తిప‌క్షాల సంగ‌తిని ప‌క్క‌న‌పెడితే అస‌లు టిడిపి నేత‌లే న‌వ్వుకోగా జ‌నాలైతే న‌మ్మ‌నేలేదు. అది ర‌మేష్ కున్న క్రెడిబులిటి.  స‌రే ఏదో మొత్తానికి దీక్ష‌కైతే ర‌మేష్ దిగారు. కానీ దీక్ష మొద‌లైన దగ్గ‌ర నుండి రోజులు గ‌డిచేకొద్దీ దీక్ష‌పై వివాదాలు, అనుమానాలు పెరుగుతుండ‌టమే ఆశ్చ‌ర్యంగా ఉంది. 


వివాదాస్ప‌ద‌మైన దీక్ష‌


అస‌లు ఎవ‌రైనా దీక్ష‌కు కూర్చుంటామ‌న‌గానే వివాదాస్ప‌దం అవ్వ‌ట‌మేంటి ? ఒక నిర్దిష్ట‌మైన కార‌ణంతో ఆందోళ‌న‌, నిర‌స‌న చేస్తే కూడా జ‌నాలు స్పందిస్తారు క‌దా ? అటువంటిది క‌డ‌ప జిల్లాలో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకు టిడిపి ఎంపి సిఎం ర‌మేష్ కూర్చుంటే రివ‌ర్స్ గేర్ లో వివాదం కావ‌ట‌మే ఆశ్చ‌ర్యంగా ఉంది. ఇటు కామ‌న్ జ‌నాలూ ప‌ట్టించుకోలేదు. అటు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌తీ రోజూ ఆరోపిస్తున్నాయి. చివ‌ర‌కు సొంత పార్టీ ఎంపి జెసి దివాక‌ర్ రెడ్డే బ‌హిరంగంగా చుల‌క‌న‌గా మాట్లాడుతున్నారు. ఇంకోవైపేమో కేంద్రంలో ఎటువంటి క‌ద‌లికా లేదు. మ‌రి, ఈ ప‌రిస్ధితుల్లో ర‌మేష్ ముందున్న దారేంటో ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. 


ప‌రువు కోస‌మే దీక్షా ?


కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వ‌కుండా దీక్ష‌ను అర్ధాంత‌రంగా నిలిపే అవ‌కాశం లేదు. అలా చేస్తే ర‌మేష్ ప‌రువే కాదు దీక్ష‌కు దింపిన చంద్ర‌బాబునాయుడు ప‌రువు కూడా గండికోట రిజ‌ర్వాయ‌ర్లో క‌లిసిపోతుంది. కేంద్రాన్ని క‌మిట్ చేయించాల‌ని టిడిపి ఎంపిలు చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫలించ‌టం లేదు. రెండు సార్లు ఎంపిల‌తో కేంద్ర‌మంత్రి బీరేంద్ర‌సిగ్ భేటీ అయినా ఉప‌యోగం లేక‌పోయింది. ఇదే అంశంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడితో భేటీ అవుదామ‌ని ఎంపిలు అనుకుంటే అపాయింట్మెంట్ దొర‌క‌లేదు. దాంతో ఏం చేయాలో ఎంపిల‌కు కూడా దిక్కు తెలీటం లేదు. 


 క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో  ఏం   చేస్తున్నారు ?

Related image

అదే స‌మ‌యంలో రమేష్ దీక్ష 10వ రోజుకు చేరుకున్నా ఆయ‌న‌లో పెద్ద‌గా మార్పు క‌న‌బ‌డ‌లేదు. మామూలుగా అయితే ఎంత‌టి ఆరోగ్య‌వంతుడైనా స‌రే ఒక రోజంతా ఆహారం తీసుకోక‌పోతే నీర‌స‌ప‌డిపోవ‌టం ఖాయం. మ‌హా అయితే రెండో రోజు వ‌ర‌కూ ఓకే. అలాంటిది రాజ్య‌స‌భ స‌భ్యుడు ప‌ది రోజుల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఆరోగ్యంగా ఎలా వుండ‌గ‌లుగుతున్నారో ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌టం లేదు. పైగా బాత్రూమ్ పేరుతో దీక్షా స్ధలానికి ప‌క్క‌నే ఉన్న‌ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోకి ర‌మేష్ ప్ర‌తీ రోజు వెళుతున్నారట‌. మామూలుగా దీక్ష‌లో ఉన్న వారు కాల‌కృత్యాలు తీర్చుకుంటారే కానీ స్నానం కూడా చేయ‌రు. అటువంటిది ర‌మేష్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారో ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు.  క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో అంత‌సేపు ర‌మేష్ ఏం చేస్తున్నార‌న్న‌ది పెద్ద‌ ర‌హ‌స్యంగా మిగిలిపోయింది. అదే ఇపుడు పెద్ద వివాదానికి దారితీస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: