కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత లోక్సభ ఎన్నికలలో మోడీ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీపై మండిపడ్డారు. స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ 15 లక్షలు వేస్తానని చూపిన ప్రధాని మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు.
Related image
నోట్ల రద్దు ఫలితంగా నల్లధనం కనుమరుగవుతుందని ప్రధాని మోడీ చెప్పారని… కానీ స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం మరింతగా పేరుకుపోతున్నదని విమర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ ప్రస్తావించారు. స్విస్‌ బ్యాంకుల్లో గత ఏడాది భారతీయులు డిపాజిట్‌ చేసిన మొత్తం 50 శాతం పెరిగిందన్న విషయాన్ని ప్రస్తావించారు.
Image result for rahul gandhi mdi
ఈ డబ్బు వైట్‌మనీగా పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారన్న ఆయన… బ్లాక్‌ మనీపై నరేంద్ర మోడీ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని రాహుల్ గాంధీ మోదీసర్కార్‌పై విరుచుకు పడ్డారు. ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో ఉన్న పేద వాడిని మరింత పేదవాడిగా మోడీ సర్కార్ మార్చేస్తుందని అన్నారు.
Image result for rahul gandhi mdi
2014 ఎన్నికలలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఇప్పటివరకు సరైన నిర్ణయాలు తీసుకోలేదని...కేవలం విదేశీ పర్యటనలకు కోటానుకోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తప్ప దేశంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు రాహుల్ గాంధీ.


మరింత సమాచారం తెలుసుకోండి: