తెలుగు రాష్ట్ర రాజకీయం లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా... ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీ తన తండ్రి పెట్టిన పార్టీ కావడం వల్లన తెలుగు దేశం లో ఉన్నారు. అయితే హరికృష్ణ టీడిపి పార్టీ మీద మరియు చంద్ర బాబు మీద అలక  ఉందని అందరికీ తెలిసిన విషయమే. తనకు సరైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని హరికృష్ణ వాపోతున్నాడు. అయితే హరికృష్ణ పార్టీ మార బోతున్నాడని రాజకీయ సర్కిల్ లో వినిపిస్తున్న మాటలు..!

Related image

టీడీపీలో హరికృష్ణకు ఎప్పుడూ ప్రాధాన్యం దక్కలేదు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పటికీ తనను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేశారనే బాధ హరికృష్ణలో ఎప్పుడూ ఉండేది. దీనికి తోడు రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, తనకు రావాల్సినంత ప్రచారం రాకుండా అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు ఆ అంశాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారంటూ అప్పట్లో హరికృష్ణ తన సన్నిహితుల దగ్గర వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

Related image

రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత హరికృష్ణను చంద్రబాబు పూర్తిగా పక్కనపెట్టారు. బాలకృష్ణకు ఎక్కువ ప్రధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో కొన్ని రోజులుగా బాబుపై గుర్రుగా ఉన్న హరికృష్ణ, టైమ్ చూసి పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారు. అక్కడితో ఆగకుండా వైసీపీ పార్టీలో చేరి నేరుగా రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి ఆమె భార్య లక్ష్మీ పార్వతి ఇప్పటికే వైసీపీలో ఉన్నారు. అది టీడీపీపై పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఇప్పుడు ఉన్నఫలంగా హరికృష్ణ వైసీపీలో చేరితే, రాబోయే ఎన్నికల్లో అది తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బగా మారుతుంది. ఎన్టీఆర్ కుటుంబంలో బాలకృష్ణ కంటే హరికృష్ణకే ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి కుటుంబం మద్దతు కూడా ఎక్కువగా హరికృష్ణకే దక్కే ఛాన్స్ ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: