నందమూరి హరిక్రిష్ణకు నారాచంద్రబాబు నాయుడు అతి త్వరలో టాటా.. బైబై చెప్పేస్తున్నాడన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. సోమవారం కొన్ని దినపత్రికల్లో, చానళ్లలో ఈ కథనాలు ప్రముఖంగా వచ్చాయి. అందుకు తగ్గట్టు టిడిపి నేత కేఇ క్రిష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ మాటగా హరిక్రిష్ణ బాగోతాన్ని ఎండగట్టడమే ఈ వార్తలకు బలాన్నిచ్చింది.

అయితే చంద్రబాబు మాత్రం ఇంకా స్పందించలేదు, కాని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఎవరు విలేఖరుల సమావేశంలో ఏ విషయం చెప్పినా అది చంద్రబాబుతో సహా, పార్టీది కూడా అదే భావం అన్నది ముందునుంచి ఉన్నదే. అందుకే హరిక్రిష్ణ వైఖరిపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నాడంటున్నారు. అంతే కాదు ఇప్పటికే చంద్రబాబు మిగిలి ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులతో కూడా ఫోన్ లో హరిక్రిష్ణ బహిష్కరణపై చర్చించినట్టు తెలుస్తోంది.

అయితే హరిక్రిష్ణపై బహిష్కరణ వేటు కేవలం పార్టీ పైనే కాదు, చంద్రబాబు కుటుంబవ్యవహారాల మీద కూడా ప్రభావం చూపుతుంది. బాలక్రిష్ణ ఎంత వియ్యంకుడైనా హరిక్రిష్ణకు తమ్ముడు, ఇంకా బాలక్రిష్ణ ఈ విషయంలో స్పందించలేదు. అయితే తన కూతురు పెళ్లికి హరిక్రిష్ణ కుటుంబం హాజరుకాకపోవడంతో ఇక బాలయ్య హరిక్రిష్ణతో తెగతెంపులు చేసుకున్నట్టే అని భావిస్థున్నారు. కాని సడన్ గా హరిక్రిష్ణను బహిష్కరించకుండా, పార్టీతో సంప్రదించకుండా రాజీనామ, యాత్ర వంటి నిర్ణయం తీసుకున్నందుకు గాను ముందుగా హరిక్రిష్ణను పొలిట్ బ్యూరో నుంచి తొలగించి, ఆ తర్వాత ఎలాంటి వివరణ రాలేదని చెప్పి ఆయన యాత్ర ప్రారంభానికి ముందే పార్టీనుంచి తొలగించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. అప్పుడు హరిక్రిష్ణ యాత్రకు టిడిపి శ్రేణులు కూడా దూరంగా ఉంటాయన్నది చంద్రబాబు ప్లాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: