జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన  కార్య క్షేత్రంగా విశాఖను ఎంచుకున్నారు వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుంచే పోటీ చేస్తానంటూ  పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పవన్  ప్రకటించడం విశేషం. తనకు ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకమైన అభిమానమని పవన్ చెబుతున్నారు. దీంతో ఆయన‌  విశాఖ నుంచే పోటీ చేస్తారన్నది ఖాయమంటున్నారు.



ఆ మూడింటిపై పవన్ చూపు :



తన సామాజికవర్గం అధికంగా ఉన్న గాజువాక, పెందుర్తి, భీమునిపట్నం అసెంబ్లీ సీట్లపై పవన్ గురి పెట్టారని టాక్. ఇంకా చెప్పాలంటే భీమిలి మీద పవన్ కి మనసైదంటునారు. కొత్తవారిని బాగా అదరించే భీమిలీలో టీడీపీకి క్యాడర్ ఈ మధ్య బాగా  చెదిరింది. వైసీపీ  ఇంకా పట్టు సంపాదించుకోలేకపోతోంది. . సరిగ్గా ఈ ఈక్వేషన్లే పవన్ ని భీమిలి వైపు నడిపిస్తున్నాయి.



అందుకే పోటీ :



పవన్ విశాఖ నుంచి పోటీ చేస్తాననడం వెనక పెద్ద ప్లాన్ వుందంటున్నారు. ఉత్తరాంధ్రలో మెగా ఫ్యామిలీకి విపరీతమైన అభిమాన జనం ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ అంటే పడి చచ్చే జనం మరీ ఎక్కువ.  పైగా 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీకి ఏపీవ్యాప్తంగా 18 సీట్లు వస్తే ఒక్క విశాఖలోనే మూడు సీట్లు దక్కాయి. దీంతో పవన్ విశాఖను ఎంచుకున్నారని అర్ధమవుతోంది.



కీ రోల్ ప్లే చేసేందుకే :



విశాఖలో పోటీ చేయడం ద్వారా ఇటు ఉత్తరాంధ్రను, అటు ఉభయగోదావరి జిల్లాలను బాగా ప్రభావితం చేయవచ్చునని పవన్ భావిస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ ఉంటే అక్కడ పవన్ సొంత సామాజికవర్గం దండిగా ఉంది .రెండు ప్రాంతాలూ కలుపుకు మొత్తం 68 సీట్లు ఉన్నాయి. వీటిలో మూడవ వంతు గెలిచినా వచ్చే ఎన్నికల తరువాత జనసేన ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ ప్లే చేస్తుంది. సరిగ్గా ఈ అంచనాలతోనే పవన్ ఉత్తరాంధ్ర స్లోగన్ అందుకున్నారు.



అందుకే లోకల్ ఇష్యూస్ పై నిరసన గళం :



విశాఖలో పోటీకి పవన్ సీరియస్ గానే  తీసుకున్నట్లు కనబడుతోంది. లోకల్ ఇష్యూస్ ని టచ్ చేస్తూ అయన సిటీలో కలియతిరగడం అందుకే అంటున్నారు. పోర్ట్ కాలుష్యంపై కన్నెర్ర చేసిన జనసేనాని విశాఖ మెడికల్ ఇన్సిట్యూట్ ను ప్రైవేట్ పరంచేస్తే ఊరుకోనని బాబుకు వార్నింగ్ 
ఇచ్చారు. ఇక  రుషికొండ ఐటీ ప్రాంతానికి వెళ్ళి అప్పనంగా భూములను మంత్రి లోకేష్ అస్మదీయులకు కట్టబెట్టడాన్ని నిలదీశారు. 



రైల్వే జోన్ పై దీక్ష :?



అతి తొందరలోనే విశాఖ రైల్వే జోన్ కోసం పవన్ ఒకరోజు దీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మొత్తం ఉత్తరాంధ్రను తనవైపుగా తిప్పుకునేందుకు పవన్ టేం మాస్టర్ ప్లాన్ వేసింది. సరైన టైం లో పవన్ దీక్షకు కూర్చుంటారని తెలుస్తోంది. ఈ దెబ్బతో అధికార టీడీపీ, విపక్ష వైసీపీలకు ఒకేమారు పొలిటికల్ ఝలక్ ఇచ్చేందుకు జనసేనాని రెడీ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: