గత ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి గల కారణాలలో ఒకటి బిజెపి. ఆనాడు బీజేపీ అభ్యర్థిగా మోడీ పేరు ప్రకటించిన క్రమంలో దేశమంతటా మోడీ హవా మారుమ్రోగిపోయింది. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మోడీ తో జతకట్టి 2014 ఎన్నికలలో రాష్ట్రమంతటా పర్యటించి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అయితే తీరా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్ర రాష్ట్రంలో అవినీతికి తెగబడ్డారు. గతంలో పది సంవత్సరాలు ప్రతిపక్షానికి పరిమితమైన చంద్రబాబు అధికారం ఒక్కసారిగా రావడంతో తన ఖజానా నింపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనటంలో సందేహం లేదు.
Related image
దీంతో చంద్రబాబు చేసిన అవినీతి రాష్ట్రాలు దాటి వెళ్లడంతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల కోసం స్వతంత్ర ఎమ్మెల్యేను కొనటానికి తెగబడ్డారు..ఈక్రమంలో ఓటుకు నోటు అని కేసుతో తెలంగాణ రాష్ట్రానికి అడ్డంగా దొరికిపోయారు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ కేసును చూపించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబుని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను కాల రాశారు. ఇదిలా ఉండగా గత నాలుగు సంవత్సరాలు చంద్రబాబు బీజేపీ పార్టీతో జతకట్టి అవినీతికి తెగబడి చివరాకరికి ఎన్నికలకు ఇంకో సంవత్సరం ఉన్న క్రమంలో కేంద్రం నుండి రాష్ట్రానికి సరైన నిధులు రావడంలేదని గగ్గోలు పెడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బయటకు వచ్చేయడం జరిగింది.
Related image
అంతేకాకుండా రాష్ట్రంలో తనకున్న అనుకూల మీడియా ద్వారా మోడీపై బీజేపీపై లేనిపోని అభాండాలు వేయడం ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే షాకిచ్చారు. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అటల్ భూజల్ లో ఏపీకి మొండి చేయి చూపించింది.
Image result for modi
దేశంలో ఉన్న రాష్ట్రాల్లో భూగర్భ జలాలను పెంచడానికి ప్రపంచ బ్యాంక్ దగ్గర తీసుకున్న ఆరు వేల కోట్లతో ఉన్న అటల్ భూజల్ యోజన పథకంలో ఏపీకి చోటీవ్వలేదు. ఈ పథకం 2018-19నుండి 2022-23వరకు కోనసాగుతుంది.ఈ పథకంలో రాష్ట్రం ఇరవై శాతం ..కేంద్రం మిగిలిన డెబ్బై శాతం నిధులు ఇస్తుంది ..తాజాగా ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు షాక్ తిన్నారు. మరోపక్క రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇవ్వడం లేదంటూ ఇచ్చిన డబ్బులను తమ ఖాతాలో వేసుకుని కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు తన ఫోటో వేయించుకుని లేనిపోని ప్రచారాలకు తెగబడుతున్నారు అంటూ మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: