చిత్తూర్ జిల్లా లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఫ్యామిలీ ఎంతో పవర్ ఫుల్ వేరే చెప్పాల్సిన పని లేదు. ఆ జిల్లా లో పోయిన సారి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీ సంపాదించాడు. అయితే వీరి ప్రభావం వల్లన చిత్తూర్ జిల్లా లో వైసీపీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోగలిగిందని చెప్పొచ్చు. అయితే పోయిన  సారి ఆరంగేట్రంతోనే రాజంపేట నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి సత్తా చూపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు వచ్చేసారి ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నాడని తెలుస్తోంది. పుంగనూరు నుంచినే మిథున్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు అని, రాజంపేట నుంచి వైసీపీ తరఫున మరొకరు బరిలోకి దిగవచ్చని సమాచారం.

Related image

మిథున్‌ స్థానంలో రంగంలోకి దిగేది మరెవరో కాదు ఆయన తండ్రి పెదిరెడ్డి రామచంద్రరెడ్డి అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇలా తండ్రీ కొడుకులు స్థానాలను మార్చుకోనున్నారని సమాచారం. మిథున్‌ ఎమ్మెల్యే రూటు పట్టడానికి ఆసక్తిదాయకమైన ఆశలే కనిపిస్తున్నాయి. పార్టీ వచ్చేసారి అధికారంలోకి వస్తుందనే బలమైన నమ్మకంతో ఉన్నారు ఈ వైసీపీ నేతలు. జగన్‌ కేబినెట్‌లో బెర్తు కూడా గ్యారెంటీ పెద్దిరెడ్డి కుటుంబానికి.

Image result for mithun reddy

గతంలో వైఎస్‌ హయాంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా వ్యవహరించాడు. గత ఎన్నికల్లో జగన్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఉన్నా పెద్దిరెడ్డి కుటుంబానికి బెర్త్‌ గ్యారెంటీనే. అది జరగలేదు. అందుకే వచ్చేసారి పక్కా ప్లాన్‌ ప్రకారం వెళ్లాలని పెద్దిరెడ్డి కుటుంబం భావిస్తోంది. చిత్తూరు జిల్లాలో రాజకీయంగా ప్రభావాత్మకశక్తిగా ఎదిగారు వీళ్లు. పార్టీ అధికారంలో లేకున్నా పెద్దిరెడ్డి తండ్రీ కొడుకుల పవర్‌ అయితే పుంజుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: