తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి..ఒక పక్క ఏపీలో చంద్రబాబు ని ఒంటరి చేసి రాజకీయ పార్టీలు కుట్రలు పన్నే ప్లాన్ లో ఉంటే మరో పక్క  కేసీఆర్ ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తల్లకిందులుగా తపస్సు చేస్తోంది..అయితే మారుతున్న సమీకరణాలు..దక్షిణాదిన ఎలాగైనా తెలుగు రాష్ట్రాలలో పాగావేయాలి అని ఆలోచిస్తున్న బిజేపీ ప్రభుత్వం అంది వచ్చిన ప్రతీ వ్యూహాన్ని అమలు చేయడానికి వేగంగా పావులు కదుపుతోంది..అందుకే ముందస్తు కి రంగం సిద్దం చేసింది చాలా సైలెంట్ గా ముందస్తు ఎన్నికలపై ఒక రిపోర్ట్  కూడా తెప్పించుకుందట ఆ రిపోర్ట్ లో భాగంగానే మోడీ షా లు కేసీఆర్ తో ఓ  భారీ వ్యూహాన్ని సిద్దం చేశారట.. 

Related image

అయితే గతంలో మోడీ పై కాలుదువ్విన కేసీఆర్ ఫ్రంట్ గింట్ అంటూ తల ఎగరేసి తరువాత తనకంత సీన్ లేదనుకుని మెల్లగా సైలెంట్ అయ్యాడు..ఆ తరువాత ఫ్రంట్ ఊసేలేదు..అయితే ఈ తరుణంలో కేసీఆర్ ఫ్యామిలీ మోడీ తో సన్నిహితంగా ఉండటం కేసీఆర్ కూడా మర్యాద పూర్వకంగా కలవడం తో ఇద్దరూ ఒక్కటి అయ్యారనే వార్తా విస్తరించేలా చేశారు..అయితే రాజకీయ ప్రయోజనమో లేక తెలంగాణ అభివృద్ధి కోసమో కానీ బీజేపీతో మళ్లీ  రాసుకు పూసుకు తిరుగుతున్నారు కేసీఆర్. 

Image result for otuku notu case
ఇదిలాఉంటే ఇప్పుడు కేసీఆర్ మోడీ ల భంధం బలపడటం తో చంద్రబాబు లో ఆందోళన వ్యక్తం అవుతోంది..ఎక్కడ ఓటుకు నోటు కేసుని బయటకి తీస్తారోనని బాబు గారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..అయితే ఆ ఆమధ్య కేసీఆర్ పై చంద్రబాబు ధిక్కార స్వరం పెంచడంతో చిర్రెత్తు కొచ్చిన కేసీఆర్ ఓటుకు నోటు అస్త్రం బయటకి తీసి రెండు రోజులు హడావిడి చేసేసరికి బాబుగారికి 102 కొట్టుకుని దారిలోకి వచ్చారట అయితే..తానూ ఏదన్న మాట్లాడితే ఓటుకు నోటు బయటకి తీసి కంట్రోల్ చేస్తున్నారని ఈ సమయంలో మోడీ కేసీఆర్ కలిస్తే తనకి ప్రమాదమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Image result for modi kcr
 అయితే ఏపీలో చంద్రబాబు దూసుకుపోతున్న నేపధ్యంలో బాబు ని కంట్రోల్ చేయాలి అంటే ముందస్తు ఎన్నికలని దృష్టిలో ఉంచుకున్న మోడీ బాబు పై ఓటుకు నోటి తీయక తప్పదని డిసైడ్ అయ్యారట ఏపీలో బాబు కి  ఉన్న ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలి అంటే ఇదొక్కటే అస్త్రం అని ఈ ఒక్క దెబ్బతో తెలుగుదేశం పార్టీ ని అదేసమయంలో ఏపీ పై పట్టుని సంపాదించచ్చు అనేది మోడీ వ్యూహంగా తెలుస్తోంది..ఏది ఏమైనా సరే మోడీ కేసీఆర్ కలయిక ఏపీ సీఎం లో టెన్షన్ రేపుతోంది అంటున్నారు విశ్లేషకులు


మరింత సమాచారం తెలుసుకోండి: