పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ లో తన అన్న మెగాస్టార్ కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సినిమా లోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక్కడ తన అన్నను మెగాస్టార్ ను వాడుకోవడానికి మొదటికే మోసం వచ్చేటట్లు ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను ప్రాధేయ పడుతున్నాడు. అయితే ఈ సినిమా కాదు కదా ఎదో ఒక డైరెక్టర్ లేదో నిర్మాత ఛాన్స్ ఇవ్వడానికి...!

Image result for pavan kalyan and janasena

పవన్ కల్యాణ్ సుమారు నెలరోజుల కిందట తన పోరాట యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏకబిగిన యాత్ర చేయబోతున్నట్లే ముందుగా ప్రకటించారు గానీ.. అందులో ఉన్న ఇబ్బందుల్ని ఆయన పసిగట్టినట్టు లేదు. తొలి విడతలోనే.. నిరసనలనీ, రకరకాల సాకులు చెప్పి బోలెడు బ్రేకులు తీసుకున్నారు. రంజాన్ పర్వదినం రాబోతున్నదనగానే.. తన బౌన్సర్లలో ముస్లింలు ఉన్నారంటూ.. ఏకంగా బ్రేక్ ఇచ్చేసి.. వచ్చి రెస్టు తీసుకున్నారు.

Image result for pavan kalyan and janasena

మధ్యలో ఏవో కొన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. తాజాగా రెండో విడత యాత్ర ప్రారంభించారు. విశాఖ జిల్లా ఎస్ కోటలో మాట్లాడుతూ.. అయిదేళ్ల పాటు పాలించేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆయన ప్రజల్ని కోరుకున్నారు. ఒకసారి యిస్తే చాలు.. మళ్లీ ఎప్పటికీ ప్రజలే ఎగబడి ఛాన్సు యిచ్చేలా మంచి పాలన అందిస్తానని కూడా హామీ ఇచ్చేశారు. అయినా పవన్ కల్యాణ్ జీ! తమరు తెలుసుకోవాల్సిన అసలు సంగతి ఒకటుంది. ఒక్క ఛాన్స్ అనే విజ్ఞప్తితో సినిమా ఇండస్ట్రీలో ఒక్క డైరక్టర్ ను గానీ, ఒక్క నిర్మాతను గానీ ఇంప్రెస్ చేయగలిగితే చాలు. కానీ.. సీఎం కుర్చీ అనేది సినిమా అవకాశం లాంటిది కాదు! ఇక్కడ అయిదు కోట్ల మందిని... అథమం రెండుకోట్ల మందినైనా ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లుగా తమ ప్రయత్నాలను ప్లాన్ చేసుకోవాలి మరి..!


మరింత సమాచారం తెలుసుకోండి: