2019 లో టీడీపీ గెలుపు అనేది చాలా ముఖ్యం. ఒక వేళ టీడీపీ గెలవకపోతే చాలా పరిణామాలు ఎదురవుతాయి. ఇప్పటికే సుదీర్ఘంగా రాజకీయాల్లో చంద్ర బాబు ఉన్నాడు. సుమారు 13 ఏళ్ల పాటు సీఎం గా పనిచేసినాడు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే మళ్ళీ ప్రతి పక్షం లో కూర్చుండే పరిస్థితి లో బాబు లేడని చెప్పాలి. జగన్ ముందు ఉండాలంటే బాబుకు ఇష్టం ఉండక పోవచ్చు. అందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని బాబు ఆలోచిస్తున్నాడు. 


Image result for chandrababu naidu

అయితే,జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో రాయ‌ల‌సీమ జిల్లాల‌తో పాటు నెల్లూరు,ప్ర‌కాశం,ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో వైసీపీకి బ‌లం మ‌రింతగా పెరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలు వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఈ నేప‌థ్యంలో ఎలాగైనా వైసీపీ మైలేజ్ ను త‌గ్గించేందుకు ఓ కొత్త నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట సీఎం చంద్ర‌బాబు.రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబు కుప్పం నుంచి పోటీ చేస్తూనే, ఎంపీగా కూడా బ‌రిలోకి దిగాల‌నుకుంటున్నారట‌. నెల్లూరు,ఒంగోలు,లేదంటే రాయ‌ల‌సీమ ప‌రిధిలోని లోక్ స‌భ సీట్ల‌లో ఏదైనా ఒక చోటునుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంద‌న్న దానిపై పార్టీ నేత‌ల‌తో స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ట సీఎం.

Image result for chandrababu naidu

కాలం క‌లిసొచ్చి,మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఏపీని చిన‌బాబు లోకేష్ చేతుల్లో పెట్టేసి,తాను జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం.ఒక‌వేళ ఏపీలో టీడీపీ ఓడిపోతే, జ‌గ‌న్ ముందు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా తాను ఉండ‌లేన‌ని కూడా చంద్ర‌బాబు వాపోతున్న‌ట్లు స‌మాచారం. టీడీపీ ఓడిపోయినా, టీడీపీ గెలిచినా ఇక‌పై ఎంపీగా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతూ, రాష్ట్రంలో పార్టీకి తోడునీడ‌లా ఉండాల‌నుకుంటున్నాడ‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: