విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ ఎంపీ అమరణ దీక్షకు రెడీ అవుతున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరపు రామ్మోహన్నాయుడు ఈ విషయాన్ని ప్రకటించేశారు కూడా. బాబు అనుమతి కోసం ఎదురుచూస్తున్నానని, ఆయన ఓకే అంటే నేను రెడీ అంటున్నారు. ఈ ఎంపీ.  దాంతో మిగిలిన టీడీపీ ఎంపీల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏదో ఒక రఒజు దీక్షతో ఈ ముచ్చట సరిపెడదామనుకుంటే సీన్ రివర్స్ అవుతోందా అంటూ బేజారవుతున్నారు.



వాళ్ళంతా నో అంటున్నారు :



ఏదో హై కమాండ్ రూలింగ్ ఇచ్చింది. ఒక రోజు దీక్ష కదా అంటే సరే అన్నాం కానీ అమరణ దీక్షలు చేయడం మా వల్ల కాదంటే కాదని ఆఫ్ ది రికార్డ్ గా టీడీపీ ఎంపీలు చెప్పేస్తున్నారు. అదే టైంలో కుర్ర ఎంపీ రామ్మోహన్ అమరణ దీక్ష చేయడాన్ని తప్పుపడుతున్నట్లు టాక్. ఎందుకొచ్చిన దీక్షలంటూ ఆ ఎంపీకి అపుడే క్లాస్ పీకడమూ అయిందంట. అయితే తాను మాత్రం ఎవరు కలిసొచ్చినా రాకపోయినా దీక్ష చేసి తీరుతానంటున్నాడు రామ్మోహన్నాయుడు.



మరో కడప సీన్ :
చంద్రబాబుకు బాగా నచ్చిన ఈ యువ ఎంపీ దీక్షకు బాబు ఓకే అనే అవకాశాలే ఎక్కువ. ఈ దీక్ష ద్వారా ఉత్తరాంధ్రలో బాగా పొలిటికల్ మైలేజ్ లాగేయవచ్చని టీడీపీ హై కమాండ్ ప్లాన్. అసలు ఎంపీ చేత ఈ మాట అనిపించిందే బాబు అని అనుమానిస్తున్నారు. బాగా పడిపోయిన పార్టీ గ్రాఫ్ ని ఈ దెబ్బతో సరిచేసుకోవచ్చునని ఎంపీలలో బాబు పొలిటికల్ స్టంట్ కి తెర లేపారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.



పవన్ ని అడ్డుకోవడానికేనా :



మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా రైలే జోన్ కోసం దీక్ష అంటున్నారని ఓ న్యూస్ వైరల్ అయింది. దానికి ముందే టీడీపీ ఎంపీ దీక్ష చేస్తే అడ్డుకున్నట్లు అవుతుంది, పార్టీకి ప్లస్ గా ఉంటుందన్న మాస్టర్ ప్లాన్ తోనే ఇలా చేశారంటున్నారు. సో రేపో మాపో విశాఖలో అమరణ దీక్ష స్టార్ట్ అవుతున్నదన్న మాట. సీయం రమేష్ నాయుడు మాదిరిగానే ఇక్కడా సీరియల్ లా సాగదీయాలన్నది టీడీపీ ప్లాన్. చూడాలి మరి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: