రాజకీయంగా క్రాస్ రోడ్లో ఉన్న  మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు బర్త్ డే వేళ మంచి గిఫ్ట్ దొరికేసింది. విష్ చేయడానికి  అనకాపల్లిలో ఆయన ఇంటికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఏకంగా పార్టీలోకి రావాలంటూ కోరడంతో షాక్ తినడం పెద్దాయన వంతైంది. 2012 తరువాత దాడి రాజకీయంగా లైంలైట్ లో లేరు. వైసీపీలో చేరినా కొడుకు ఓడిపోవడంతో అక్కడా గుడ్ బై కొట్టేశారు.

దూకుడు మీదున్న పవన్ :


రెండవ విడత యాత్ర కాదు కానీ పవన్ మాంచి దూకుడు మీదున్నారు. వరుస చేరికలతో ఓ వైపు పార్టీకి  జోష్ పెంచుతూనే మరో వైపు సీనియర్ల వైపూ కన్నేశారు. జిల్లాలో పెద్ద తలకాయగా ఉన్న దాడిని చేర్చుకోవడం ద్వారా పవన్ పాలిట్రిక్స్  ప్లే  చేశారనే చెప్పాలి. అనకాపల్లి వరకు దాడికి పట్టుంది. దాంతో ఆయన్ని పార్టీలోకి రప్పించడం ద్వారా  ఆ   సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని పవన్ ట్రై చేస్తున్నారు. జిల్లాలో అనకాపల్లి, విశాఖ పశ్చిమ, పెందుర్తి అసెంబ్లీలలో ఆ వర్గం ఓట్లు కీలకం 


థర్డ్ ఇన్నింగ్స్ :


మూడున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం గడిపిన దాడికి ఇది థర్డ్ ఇన్నింగ్స్. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు విడతలు మంత్రిగా పనిచేసిన ఆయన చరమాంకంలో వున్నారు. తన కుమారుడిని పోటీలో దింపి తాను తెర వెనక పాత్ర పోషించాలనుకుంటున్నారు. టీడీపీలోకి మళ్ళీ వెళ్ళాలనుకున్నా కుదరక, వైసీపీలో చేరలేక అనామక పాత్ర పోషిస్తున్న దాడికి అజ్ఘ్ణాతవాసి పవన్ ఓ విధంగా బూస్టప్ ఇచ్చారనే చెప్పాలి


త్వరలోనే కండువా సీన్ :


ఇప్పటికి రెండు పార్టీలు మారిన దాడి తొందరలోనే జనసేన కండువా కూడా కప్పేసుకుని హ్యట్రిక్ కొడతారని టాక్ నడుస్తోంది. పవన్ ప్రతిపాదనపై ఆలోచించి చెబుతానన్న దాడికి ఇది బంపర్ ఆఫర్ గానే చూడాలి. జనసేనకు జిల్లాలో పెద్ద దిక్కుగా కీలక బాధ్యతలు అప్పగించే చాన్స్ వుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: