వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. జగన్ అడుగు పెట్టిన ప్రతి చోటా ప్రజలు తమ సమస్యలు చెబుతూ గత ఎన్నికలలో చంద్రబాబు ఏవిధంగా తమను మోసం చేశారో ప్రజలు తమ బాధను చెప్పుకుంటున్నారు జగన్ కి. జగన్ తన పాదయాత్రలో వృద్ధులను పెద్దలను యువకులను చిన్నారులను పలకరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర చేస్తున్నారు.
Image may contain: 14 people, people smiling, crowd and outdoor
ఈ సందర్భంగా జగన్ 204 వ రోజు పాదయాత్రలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది….ఉప్పుమిల్లికి చెందిన ల‌క్ష్మ‌మ్మ అనే ఓ వృద్ధురాలు జ‌గ‌న్‌ను క‌లిసింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ హ‌యాంలో త‌న‌కు ప్ర‌తీ నెలా పింఛ‌న్ వ‌చ్చేద‌ని, కానీ, నేడు చంద్ర‌బాబు స‌ర్కార్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి త‌న‌కు పింఛ‌న్ రాకుండా ర‌ద్దు చేశార‌ని జ‌గ‌న్‌తో చెప్పుకుని వాపోయింది.
Image may contain: 11 people, people smiling, crowd and outdoor
త‌న‌కు పింఛ‌న్ తీసుకునే అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు నియ‌మించిన జ‌న్మ‌భూమి క‌మిటీల వారు.. త‌న వ‌య‌స్సుకు పింఛ‌న్ తీసుకునేందుకు అర్హ‌త లేద‌ని, త‌న వ‌య‌స్సు కేవ‌లం 49 అని త‌మ ప‌త్రాల్లో న‌మోదు చేసుకుని వెళ్లార‌ని జ‌గ‌న్‌కు చెప్పింది. అటువంటి చంద్ర‌బాబు పాల‌న మ‌ళ్లీ.. మ‌ళ్లీ రాకూడ‌ద‌ని, నీవే నాకు న్యాయం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్‌కు విన‌తిప‌త్రం అంద‌జేసింది.
Image may contain: 3 people, people smiling, outdoor
ఈ క్రమంలో వృద్ధురాలి భాదను విన్న జగన్ చలించిపోయారు. కంగారు పడవద్దు అని ధైర్యం చెప్పి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు జగన్. వైసీపీ అధికారంలోకి వస్తే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవాని పేర్కొన్నారు..మతం కులం ప్రాంతం పార్టీ చూడకుండా అందరికీ న్యాయం చేశాల ప్రభుత్వ పనులు జరుగుతాయని భరోసా ఇచ్చారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: