దొడ్డిదోవ‌గుండా మంత్రివ‌ర్గంలోకి ప్ర‌వేశించిన పొంగూరు నారాయ‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. నెల్లూరు జిల్లాకే చెందిన నారాయ‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయ‌టానికి రంగం సిద్దం చేసుకున్నార‌ట‌. ఎంఎల్సీ అయిన త‌ర్వాత నారాయ‌ణ మంత్ర‌వ్వ‌గానే ఒక్క‌సారిగా విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఎంఎల్ఏగా పోటీ చేసేంత సీన్ లేకే ఎంఎల్సీ అయి మంత్ర‌య్యారంటూ టిడిపితో పాటు వైసిపి నేత‌లు కూడా ఎద్దేవా చేశారు. 


నారాయ‌ణ‌ను బాధించిన చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు

Image result for minister narayana and chandrababu

దానికితోడు చంద్ర‌బాబునాయుడు కూడా వివిధ  స‌మీక్ష‌ల్లో మాట్లాడుతూ, ఎంఎల్సీ ద్వారా మంత్రియితే ఏమొస్తుంది ? ఎంఎల్ఏగా పోటీ చేసి గెలిస్తేనే స‌మ‌స్య‌లు తెలుస్తాయ‌ని వ్యాఖ్య‌లు చేశార‌ట‌. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు నారాయ‌ణ‌ను ఉద్దేశించే చేశారా లేక‌పోతే ఇంకెవ‌రినైనా ఉద్దేశించారా ? అన్న‌ది మాత్రం తెలీదు. అయితే, చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేసిన‌పుడు నారాయ‌ణ కూడా అక్క‌డే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక‌టికి ప‌దిసార్లు చంద్ర‌బాబు త‌న వ్యాఖ్య‌ల‌ను రిపీట్ చేస్తుండ‌టంతో నారాయణ బాగా నొచ్చుకున్నార‌ట‌. అందుక‌నే వ‌చ్చే  ఎన్నిక‌ల్లో ఎంఎల్ఏగా పోటీ చేసి త‌న స‌త్తా ఏంటో చూపించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.


నెల్లూరులో టిడిపి బ‌ల‌మెంత ?


నారాయ‌ణ పోటీ చేద్దామ‌ని అనుకోవ‌టం వ‌ర‌కూ ఓకే,  కానీ సిటీలో టిడిపి బ‌ల‌మెంత ?  నారాయ‌ణ‌కు గెలుపు అవ‌కాశాలెంత‌ అన్న‌దే ప్ర‌శ్న‌. ఎందుకంటే, మొత్తం జిల్లాలో వైసిపి బ‌లంగా ఉంది. పోయిన ఎన్నిక‌ల్లో జిల్లాలోని 10 సీట్ల‌లో  ఏడు సీట్ల‌ను వైసిపి గెలుచుకుంది. జిల్లాలోని ఏకైక ఎంపి సీటును కూడా వైసిపినే నెగ్గింది. పోయిన ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే వైసిపి ఈసారి మ‌రింత బ‌లోపేత‌మైంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికితోడు చంద్ర‌బాబు నాలుగేళ్ళ పాల‌నపై  జ‌నాల్లో వ్య‌తిరేక‌త‌ పెరిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జిల్లాలో వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌కు  జ‌నాలు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టిన విష‌యం అంద‌రూ చూసిందే. 


బ‌లంగా ఉన్న వైసిపి

Image result for mla anil kumar yadav

అదే స‌మ‌యంలో టిడిపిలో అంతఃక‌ల‌హాలు బాగా పెరిగిపోయాయి.  మంత్రి నారాయ‌ణంటే చాలామంది నేత‌ల‌కు ప‌డ‌టం లేదు. దానికితోడు నెల్లూరు సిటీలో టిడిపి మొద‌టి నుండి చాలా వీక్. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ కేవలం రెండు సార్లు మాత్ర‌మే నెల్లూరులో టిడిపి గెలిచిందంటే పార్టీ ఎంత బ‌ల‌హీనంగా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏ అనీల్ కుమార్ యాద‌వ్ కు జ‌నాల్లో మంచి పేరుంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల పేరుతో ఎప్పుడూ జ‌నాల్లోనే తిరుగుతుంటారు. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు కావ‌టం కూడా అనిల్ కు క‌ల‌సి వ‌స్తోంది. మ‌రి, ఇటువంటి నేప‌ధ్యంలో రాజ‌కీయంగా ఏమాత్రం బేస్ లేని నారాయ‌ణ ఎంఎల్ఏగా  పోటీ చేస్తే ఎలాగుంటుంద‌నే విష‌యంలో పెద్ద ఎత్తున చ‌ర్చ మొద‌లైంది. చూడ‌బోతే వ‌చ్చే ఎన్నిక ఇక్క‌డ ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌టం మాత్రం ఖాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: